డిఫెన్స్ ల్యాబ్ లో జంతువులపై కరోనావైరస్ వ్యాక్సిన్ నమూనాను పరీక్షిస్తున్న ఇజ్రాయెల్!

డిఫెన్స్ ల్యాబ్ లో  జంతువులపై కరోనావైరస్ వ్యాక్సిన్ నమూనాను పరీక్షిస్తున్న ఇజ్రాయెల్!
x
representational image
Highlights

కరోనా వైరస్ పై పోరాటంలో ఇజ్రాయెల్ మెరుగైన ముందడుగు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశంలోని నేతాన్యాహు కార్యాలయం చేసిన ఒక ప్రకటన ఆధారంగా...

కరోనా వైరస్ పై పోరాటంలో ఇజ్రాయెల్ మెరుగైన ముందడుగు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశంలోని నేతాన్యాహు కార్యాలయం చేసిన ఒక ప్రకటన ఆధారంగా ఇండియాటుడే బుధవారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ సిద్ధం చేశారు. ఈ వ్యాక్సిన్ ను ప్రస్తుతం రక్షణ ప్రయోగశాలలో ఎలుకలపై పరీక్షిస్తున్నట్ట్ట్టు చెబుతున్నారు. ఇది విజయవంతం అయితే, త్వరలోనే కరోనా వైరస్ అరికట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతాన్యహు అక్కడి rural Ness Ziona ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ ఇనిస్టిట్యుట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్)ను ఫిబ్రవరి 1 వ తేదీన కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాట్టంలో పాల్గోవాలని ఆదేశించారు. దీంతో రామ్ గంలోకి దిగిన ఆ సంస్థ దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కనుక్కోవడంలో ముందడుగు వేసింది. ఈ విషయంలో వ్యాక్సీన్ ప్రోటోటైప్ రూపొందించడంలో తమ గణనీయమైన పురోగతిని ఐఐబిఆర్ డైరెక్టర్ ష్ముయేల్ షాపిరా తెలిపినట్టు నేతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జంతువుల పై పరిశీలన ప్రారంభించడానికి ఒక నమూనాను ఐఐబిఆర్ సిద్ధం చేస్తోంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఎలుకలపై ఇప్పటికే అక్కడ పరీక్షలు జరుగుతున్నాయని ఐఐబిఆర్ పరిశోధనల గురించి తెలిసిన కొందరు తెలిపినట్టు ఆ కథనం పేర్కొంది. అయితే, ఏరకమైన ఎలుకలు అనే విషయాన్ని చెప్పడానికి వారు నిరాకరించారు. ఇక పొతే, ఐఐబిఆర్ జీవ రసాయన ఆయుధాల తయారీ ప్రాజెక్టులపై పనిచేస్తుందని విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, దానిని ఇజ్రాయెల్ ఎప్పుడూ ఖండించలేదు అలా అని ధ్రువీకరించలేదు కూడా. అయితే, ఐఐబిఆర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఇరాన్ జహాని గత వారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ కొత్త కరోనా వైరస్ ఎదుర్కోవడం పై దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. ఇనిస్టిట్యూట్ కి చెందిన మూడు గ్రూపులు కోవిడ్-19 వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా మరికొంత మంది పరిశోధకులు దీనికి సంబంధించిన చికిత్సలపై పరిశోధనలు సాగిస్తున్నట్టు తెలిపారు.

గత వారం జెరూసలేం వెంచర్ పార్ట్‌నర్స్ నిర్వహించిన ఆంగ్ల భాషా ఆన్‌లైన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ''కరోనా విషయంలో ఇతరుల ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ, లేబొరేటరీ లో ఖాళీ లేకపోవడంతో ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా, ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది కావడంతో అన్ని అంశాలను పరిశీలించి నెమ్మదిగానూ, జాగ్రత్తగానూ పనిచేయాల్సివస్తుందని పేర్కొన్నారు. జంతువులపై ఈ వ్యాక్సిన్ నమూనాను పరిశీలించడానికి చాలా అడ్డంకులున్నాట్టు ఇరాన్ జహానీ చెబుతున్నారు. జంతువులలో వైరస్ ను న్యూట్రలైజ్ చేసే వ్యవస్థను రూపొందిస్తే సరిపోదు. జంతువులను గుర్తించడానికి ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అదేవిధంగా అవి నిజంగా అనారోగ్యంగా లేకపోయినప్పటికీ, వాటిని ఆ దిశలో సిద్ధం చేసి ఈ వ్యాధితో కోలుకునే వ్యాక్సిన్ చర్యలను పరిశీలించడానికి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఇది అంత తేలిక కాదని ఆయన చెప్పారు. కొత్త కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణలో ఐఐఆర్బి కూడా పాల్గొంటుందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం.. ఇజ్రాయెల్ కరోనా వ్యతిరేక వ్యాక్సీన్ నమూనాను సిద్ధం చేసిందనడానికి ఈ వ్యాఖ్యలు ఉదాహరణగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories