
కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. సెయింట్ థామస్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు uk డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఎడ్వర్డ్ అర్గార్ తెలిపారు.
కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. సెయింట్ థామస్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు uk డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఎడ్వర్డ్ అర్గార్ తెలిపారు. ప్రధానమంత్రి స్థిరమైన స్థితిలో ఉన్నారు, సౌకర్యవంతంగా, మంచి ఉత్సాహంతో ఉన్నాడు" అని వెల్లడించారు. 55 ఏళ్ల ప్రధాని స్వయంగానే ఊపిరి పీల్చుకుంటున్నారని ఎడ్వర్డ్ అర్గార్ తెలిపారు. 'ప్రధానికి యాంత్రిక వెంటిలేషన్ , నాన్ - ఇన్వాసివ్ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం లేదు' అని విలేకరులతో అన్నారు. మరోవైపు ప్రధానమంత్రికి న్యుమోనియా ఉన్నట్లు డౌనింగ్ స్ట్రీట్ నిర్ధారించింది. కాగా మార్చి 27 న తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలినట్టు స్వయంగా బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ఆ తరువాత 10 రోజులపాటు తన ఇంటినుంచి చికిత్స తీసుకున్న ఆయన లక్షణాలు తీవ్రతరం కావడంతో సెయింట్ థామస్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారు. అప్పటిదాకా విధులు ఆయనే నిర్వర్తించారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమించడంతో ″అవసరమైన చోట" ప్రధానమంత్రి విధులను చేపట్టడానికి విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను నియమించారు. ఇదిలావుంటే యూకేలో కోవిడ్ కేసులు 55.242 కు చేరుకున్నాయి.. అలాగే మరణాల సంఖ్య 6.159 గా నమోదయింది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే కేసులు మాత్రం యాభై వేలు దాటాయి కానీ రికవరీ కేసులు మాత్రం 150 కూడా దాటలేదు. ప్రస్తుతం రికవరీ కేసులు కేవలం 145 మాత్రమే ఉన్నాయి. చైనాలో 83 వేల కేసులకు గాను దాదాపు 80 శాతం మంది కోలుకున్నారు. కానీ యూకే లో పరిస్థితి ఇందుకు బిన్నంగా ఉంది. పైగా ఈ పరిస్థితి ఆ దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలావుంటే కోవిడ్ -19 గ్లోబల్ కేసులు 1.5 మిలియన్లకు చేరుకోబోతున్నాయి, మరణాల సంఖ్య 80,000 దాటింది. ఎక్కువగా యుఎస్, స్పెయిన్, ఇటలీ , ఫ్రాన్స్ , చైనా, ఇరాన్, జర్మనీ వంటి దేశాలు కరోనా వైరస్ కు తీవ్రంగా ఇబ్బందులు చెందుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



