కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే.. నోబెల్ గ్రహీత సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే.. నోబెల్ గ్రహీత సంచలన వ్యాఖ్యలు
x
Luc Montagnier (File Photo)
Highlights

చైనాలోని వుహాన్‌ నగరంలోనే కరోనా వైరస్ స్వయంగా మనుషులే తయారుచేశారనే ఆరోపణలు 4 నెలలుగా వినిపిస్తున్నాయి.

చైనాలోని వుహాన్‌ నగరంలోనే కరోనా వైరస్ స్వయంగా మనుషులే తయారుచేశారనే ఆరోపణలు 4 నెలలుగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఫాక్స్ న్యూస్ కూడా ఒక కథనంలో వైరస్‌లపై ప్రయోగాలు చేసే మూడు ల్యాబ్‌లు ఉన్నాయి. వన్యప్రాణులు అమ్మే మార్కెట్ దగ్గర్లోనే ఉంటుంది. అక్కడే కరోనా వైరస్ తయారు చేశారని చైనాకి వ్యతిరేకంగా వార్త ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు చైనాపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా.. ఫ్రాన్స్ వైరాలజిస్ట్ మెడిసిన్‌లో నోబెల్ బహుమతి పొందిన ల్యుక్ మొంటాగ్నియర్ (Luc Montagnier) కరోనా వైరస్ (SARS-CoV-2) అనేది మనుషులు సృస్టేనని.. వుహాన్ లోని నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్‌కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందని ఆయన వ్యాఖ్యనించారు. చైనా 2000 సంవత్సరం నుంచి ఈ ల్యాబ్ లో ఇలాంటి వైరస్‌లపై పరిశోధనలు చేస్తోందిని. అయన తెలిపారు.

ఫ్రాన్స్‌కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొంటాగ్నియర్ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో మొంటాగ్నియర్ మరో ఇద్దరు శాస్త్రవేత్తలు ఎయిడ్స్ వైరస్‌ని గుర్తించారు. దాంతో వారికి 2008లో మెడిసిన్‌లో నోబెల్ అవార్డ్ వరించింది. కాగా.. ఈ ఇంటర్వ్యూ లో మొంటాగ్నియర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కరోనా వైరస్ జన్యువుల్లో... ఎయిడ్స్ (HIV) మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు చెప్పారు. అందుకే సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆరోపణలపై దర్యాప్తికి ఆదేశించించారు. ట్రంప్ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపారు. అయితే మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం మొంటాగ్నియర్ వ్యాఖ్యల్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories