
చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేవాలన్నింటికీ పాకుతుంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేవాలన్నింటికీ పాకుతుంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగున్నప్పటికీ ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకూ కరోనా నిర్మూలనకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కరోనాపై సమరానికి కాలుదూస్తుందని తెలిపారు. ఈ వైరస్ ను తరిమి కొట్టేందుకు వ్యాక్సిన్ తయారీ చేయడానికి సన్నద్దం అయిందని తెలిపారు. అమెరికాకు చెందిన బయో మెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ కి, తమ సంస్థకు చెందిన 'జన్ సేన్ ఫార్మస్యుటికల్ కంపెనీకి మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారమే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇందుకోసం గత జనవరి నెలనుంచే సన్నాహాలు మొదలు పెట్టామన్నారు.
ఈ వ్యాక్సిన్ తయారు చేసిన తరువాత దాన్ని ఇచ్చేందుకు ఓ ఆరోగ్యవంతుడైన వ్యక్తిని కూడా ఎంపిక చేసిందని ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతం అయితే తమ ప్రయత్నంలో భాగంగావందకోట్ల డోసులకు పైగా సప్లయ్ చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే మొదటి విడత వ్యాక్సీన్ ను ఉపయోగించే విధంగా వచ్ఛే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి తమ తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీస్ ప్రారంభం అవుతాయన్నారు. కొత్తగా రూపొదించిన అమెరికన్ కొత్త వెబ్ సైట్ ద్వారా తమ ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తృతం చేయననున్నామన్నారు. ఇతర దేశాల సైట్లకు ఆ తరువాతే దీన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. క్లినికల్ డేటా ప్రభావాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి అంచనావేస్తామని ప్రతినిధులు వెల్లడించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




