Coronavirus: యుఎస్‌లో మరో 1225 మంది మృతి

Coronavirus: యుఎస్‌లో మరో 1225 మంది మృతి
x
Representational Image
Highlights

అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 1225 మంది మరణించారు. దీంతో అమెరికాలో మరణించిన వారి సంఖ్య లక్షా 4వేల...

అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 1225 మంది మరణించారు. దీంతో అమెరికాలో మరణించిన వారి సంఖ్య లక్షా 4వేల 542 గా ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఇప్పుడు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,745,606 గా ఉందని పేర్కొంది.

మరోవైపు కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ లో జూన్ 8 నుండి లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. దాదాపు నాలుగు లక్షల మంది తమ రోజువారీ పనులకు వెళ్తారని వారికోసం బస్సులు, రైళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని.. వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం జరుగుతుందని వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories