పాక్ లో పెరిగిపోతోన్న కరోనా వ్యాప్తి.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

పాక్ లో పెరిగిపోతోన్న కరోనా వ్యాప్తి.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
x
Highlights

పాకిస్తాన్ లో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

పాకిస్తాన్ లో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,352 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 40,000 దాటగా , దేశంలో మరణించిన వారి సంఖ్య 873 కు చేరుకుంది.. మొత్తం 40,151 కేసుల్లో సింధ్‌లో 15,590, పంజాబ్ 14,584, ఖైబర్-పఖ్తుంఖ్వా 5,847, బలూచిస్తాన్ 2,544, ఇస్లామాబాద్ 947, గిల్గిత్-బాల్టిస్తాన్ 527, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 112 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మొత్తం 39 మంది మరణించారు, మరణాల సంఖ్య 873 కు చేరుకోగా, మరో 11,341 మంది పూర్తిగా కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు 373,410 పరీక్షలు జరిగాయని, గత 24 గంటల్లో 14,175 పరీక్షలు జరిగాయని పాక్ ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా అంటువ్యాధుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోకుండా లాక్డౌన్ పరిమితులను సడలించింది. అయితే కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కదలికలను నిరోధించడానికి సెలెక్టివ్ లాక్డౌన్ విధానాన్ని అవలంబించినట్లు సమాచార మంత్రిత్వ శాఖ షిబ్లి ఫరాజ్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories