ఇరాన్ లో మళ్ళీ కరోనా విజృంభణ..

ఇరాన్ లో మళ్ళీ కరోనా విజృంభణ..
x
Highlights

ఇరాన్ లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 24 గంటల్లో 2819 కొత్త కేసులు ఇక్కడ నమోదయ్యాయి....

ఇరాన్ లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 24 గంటల్లో 2819 కొత్త కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అలాగే 50 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసులు లక్ష 46 వేల 669 కు పెరిగాయి. లక్ష 14 వేల 931 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు 7677 మంది మరణించారు. ఇరాన్ లో సంక్రమణ అయితే వేగంగా పెరుగుతోంది కానీ మరణాల సంఖ్య మాత్రం నిలకడగా ఉంది. ఇక ప్రపంచంలో ఇప్పటివరకు 59 లక్షల 25 వేల 728 మందికి వ్యాధి సోకింది. 25 లక్షల 93 వేల 698 మంది నయమయ్యారు. మరణాల సంఖ్య 3 లక్షల 62 వేల 114 కు పెరిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories