
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది..
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఇక్కడ గత 24 గంటల్లో 1127 మరణాలు సంభవించాయి.. దాంతో అమెరికాలో 98 వేల 683 మరణాలు నమోదయ్యాయి. కరోనావైరస్ పేరుకు చైనాలో ఉద్భవించినప్పటికీ అమెరికాలోనే అత్యధికంగా కేసులు, మరణాలు ఉన్నాయి. అమెరికా దేశంలో ఎక్కువగా ప్రభావితమైన న్యూయార్క్‌లో 24 గంటల్లో 84 మంది మరణించారు. మార్చి తరువాత మొదటిసారిగా, ఒకే రోజులో మరణించిన వారి సంఖ్య 100 కంటే తక్కువగా నమోదైంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షల 66 వేల 828 కు చేరుకుంది. న్యూయార్క్‌లో ఇప్పుడు ఇన్‌ఫెక్షన్లు, మరణాల సంఖ్య తగ్గుతోంది. ఇక్కడ ఇప్పటివరకు 3 లక్షల 69 వేల 656 మందికి కరోనా వ్యాధి సోకింది, 29 వేల 112 మంది మరణించారు. కాగా శనివారం సాయంత్రం నాటికి, యుఎస్ లో మొత్తం 97,048 మరణాలు , 1.6 మిలియన్ వైరస్ కేసులను నమోదు చేసింది, అతి కొద్ది రోజుల్లోనే అమెరికా 100,000 మరణాలకు చేరుకుంటుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



