ఇండియాకు ట్రంప్ హెచ్చరికలు.. ప్రతీకార చర్యలు ఉంటాయని వార్నింగ్

ఇండియాకు ట్రంప్ హెచ్చరికలు.. ప్రతీకార చర్యలు ఉంటాయని వార్నింగ్
x
Donald Trump (File Photo)
Highlights

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్ పై ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్ పై ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు. మ‌న దేశంలో మ‌లేరియా నివార‌ణ‌కు ఉప‌యోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాధి నివార‌ణ‌కు ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ ముందు ఎగుమ‌తుల‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేదం విధించింది. భార‌త్ నుంచి అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం ఎగుమతి అవుతున్నాయి. దీంతో ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ట్రంప్ మోదీపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ప్రధాని మోదీని ఆదివారం ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన ట్రంప్ చేసిన విష‌యం తెలిసిందే. మోదీ నిరాక‌రిచండంతో భార‌త్ పై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్న‌ట్ల వార్త‌లు వ‌స్తున్నాయి. కరోనా వైరస్ స‌మ‌స్య వ‌ద‌లిన త‌ర్వాత ఇండియాపై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది..

కరోనా వైరస్‌ని నివార‌ణ‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రమే సరైన మందుగా ట్రంప్ భావిస్తున్నారు. భారత్ కూడా క‌రోనా నివార‌ణ‌కు ఈ ముందే అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది. భారత్ తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటే మంచిదే, లేక‌పోయినా స‌రే.. కానీ దానికి ప్రతీకారం (retaliation) ఉంటుందని వైట్ హౌస్ దగ్గర ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories