ఇప్పటివరకు 54.07 లక్షల మందికి కరోనా.. రెండో స్థానంలో ఆ దేశం..

ఇప్పటివరకు 54.07 లక్షల మందికి కరోనా.. రెండో స్థానంలో ఆ దేశం..
x
Representational Image
Highlights

ప్రపంచంలో ఇప్పటివరకు 54 లక్షల 7 వేల 378 మందికి కరోనావైరస్ సోకింది. అయితే ఇందులో 22 లక్షల 47 వేల 930 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 3 లక్షల 44 వేల 19...

ప్రపంచంలో ఇప్పటివరకు 54 లక్షల 7 వేల 378 మందికి కరోనావైరస్ సోకింది. అయితే ఇందులో 22 లక్షల 47 వేల 930 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 3 లక్షల 44 వేల 19 వరకు పెరిగింది. అదే సమయంలో, బ్రెజిల్లో 3 లక్షల 49 వేలకు పైగా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. యుఎస్ తరువాత రెండవ అత్యధిక రోగులు కలిగిన దేశంగా ఉంది. ఇక్కడ 22 వేల 165 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం , 24 గంటల్లో 1 లక్ష 9 వేల 536 కొత్త కేసులు నమోదయ్యాయి, 5600 మంది మరణించారు.

ఉత్తర, దక్షిణ అమెరికాలో గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, ఐరోపాలో మరణించిన వారి సంఖ్య 1 లక్ష 73 వేలకు చేరుకుంది. ఇక ఇటలీలో 24 గంటల్లో 119 మంది మరణించారు. దాంతో ఇక్కడ మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 32 వేల 735 కు పెరిగింది. అదే సమయంలో, సంక్రమణ సంఖ్య 2 లక్ష 29 వేల 327 గా ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1 లక్ష 38 వేల 840 మంది వ్యాధి భారిన పడి కోలుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories