Coronavirus: దక్షిణకొరియాలో పెరుగుతున్న కేసులు.. ఉత్తరకొరియాలో వైరస్ ఉన్నా లేదని ప్రచారం..

Coronavirus: దక్షిణకొరియాలో పెరుగుతున్న కేసులు.. ఉత్తరకొరియాలో వైరస్ ఉన్నా లేదని ప్రచారం..
x
Highlights

చైనా తరువాత దక్షిణ కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. చైనా తరువాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి కొత్తగా 210 కేసులు, మరో రెండు...

చైనా తరువాత దక్షిణ కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. చైనా తరువాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి కొత్తగా 210 కేసులు, మరో రెండు మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం 3,736 కరోనా కేసులు మరియు 20 మరణాలు నమోదయినట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా ఆగ్నేయ నగరమైన డేగు మరియు సమీప ప్రాంతాలలో ఎక్కువ కేసులు ఉన్నాయి.

జపాన్ వ్యతిరేక స్వతంత్ర తిరుగుబాటు యొక్క 101 వ వార్షికోత్సవాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్రారంభించాడు.. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించడానికి జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు. మరోవైపు కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దక్షిణ కొరియాకు అమెరికన్లు వెళ్లద్దని అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం కరోనా కేసులు తమ దేశంలో లేవని స్పష్టం చేస్తూ వస్తోంది. కానీ ప్యోంగ్యాంగ్ నగరంలో కరోనా లక్షణాలతో జనాలు బాధపడుతున్నారని ప్రపంచ మీడియా చెబుతోంది. అక్కడ కరోనా వైరస్ ఉందన్న అనుమానాన్ని బయటికి రాకుండా.. వైరస్ సోకిన ఓ అధికారినే నిర్ధాక్ష్యణీయంగా కాల్చేశారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories