Top
logo

రూటు మార్చిన ట్రంప్.. మిత్రుడు మోదీపై ప్రశంసల జల్లు

రూటు మార్చిన ట్రంప్.. మిత్రుడు మోదీపై ప్రశంసల జల్లు
X
Donald Trump and Narendra Modi (File Photo)
Highlights

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రూటు మార్చుకున్నారు. త‌న మిత్రుడు భార‌త ప్ర‌ధానిపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించారు.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రూటు మార్చుకున్నారు. త‌న మిత్రుడు భార‌త ప్ర‌ధానిపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించారు. అమెరికాలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చిన త‌రుణంలో తమ దేశానికి మందులు పంపాల‌ని ప్ర‌ధాని మోదీని కోరారు. అందుకు మోదీ వెంటనే సమాధానం ఇవ్వలేదు. అయితే దీనిపై భార‌త్ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ట్రంప్ ఆగ్ర‌హానికి గురైయ్యాడు. భార‌త‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించాడు. ఆ ప్రక‌ట‌న చేసి 24 గంటలు గడవకముందే.. నోటి దురుసు కాస్త త‌గ్గించుకున్నాడు. భార‌త్ గొప్పదేశం అనీ, ప్రధాని మోదీతో తాను బాగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. భార‌త్ పై ప్రతీకారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఏం చేస్తారు అని అమెరికా మీడియా అడిగితే నాలిక్కరుచుకున్నారు. అదేం లేద‌ని దీనికి కార‌ణం తెర వెనుక ప‌రిణామాలు అని అన్నారు.

కరోనా వైరస్ భార‌త్ లో వేగంగా వ్యాపించ‌డంతో ఒక్క‌సారిగా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో భారతీయులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు అవ‌సరం అనే నిర్ణ‌యంతో మోదీ విదేశాలకు ఎగుమ‌తులు ఆపేశారు. దాంతో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తమకు హెచ్ఎస్ క్యూ మందు కావాలనీ కోరారు. తన మాటను పట్టించుకోలేదన్న కోపంతో ట్రంప్ వైట్ హౌస్ ముందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.

తాజాగా మ‌రోసారి మాట్లాడిన ట్రంప్ .. "ప్రధాని మోదీ చాలా మంచివారు. నేను భార‌త‌ ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు... హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మాకు పంపాల‌ని కోరాను.. భార‌త్ ద‌గ్గ‌ర పూర్తి స్థాయిలో ఉన్నాయా అని ఆడిగాన్నారు. ఇండియా ద‌గ్గ‌ర నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్లు దానిపై నిషేధం విధించారు. ఎందుకంటే అది భార‌తీయుల‌కు అవసరం కాబట్టి" అని ట్రంప్ త‌న‌ తప్పును దిద్దుకున్నారు.

ట్రంప్ ప్రకటన చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్వి దేశాల‌కు ఎగుత‌మ‌తులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ట్రంప్ బెదిరింపుల‌కు కాద‌ని, మానవతా దృక్పథంతో అవ‌స‌ర‌మైన అన్ని దేశాల‌కు సరఫరా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నోరు జారి భార‌త్ ను ఆడిపోసుకున్న ట్రంప్ ను అమెరికా మీడియా ఎండ‌గ‌ట్టింది.


Web TitleCoronavirus updates America President Donald Trump praises Narendra Modi in Front of us Media
Next Story