Coronavirus: ఆఫ్ఘనిస్తాన్‌లో కేవలం 6వేల పరీక్షలే.. కారణం ఇదే..

Coronavirus: ఆఫ్ఘనిస్తాన్‌లో కేవలం 6వేల పరీక్షలే.. కారణం ఇదే..
x
Highlights

ఇప్పటికే ఉగ్రవాదంతో సతమతమవుతోన్న ఆఫ్ఘనిస్తాన్‌లో కరోనావైరస్ తో పరిస్థితి మరింత దిగజారుతోంది.

ఇప్పటికే ఉగ్రవాదంతో సతమతమవుతోన్న ఆఫ్ఘనిస్తాన్‌లో కరోనావైరస్ తో పరిస్థితి మరింత దిగజారుతోంది. వైరస్ రోజురోకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 1092 సంక్రమణ కేసులు నమోదు కాగా.. మొత్తం 36 మంది మరణించారు. అయితే ఈ అంకెలను నిపుణులు నమ్మడం లేదు.. సంక్రమణ కేసులు విడుదల చేసిన డేటా కంటే చాలా రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఇది కాకుండా, పరీక్షల విషయంలో కూడా దేశం చాలా వెనుకబడి ఉంది. 30 మిలియన్ల జనాభా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో కేవలం 6612 పరీక్షలు మాత్రమే జరిగాయి.

ఫిబ్రవరి 24 న హెరాత్ ప్రావిన్స్లో ఇరాన్ నుండి ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చినప్పుడు దేశంలో మొదటి సంక్రమణ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత, టెహ్రాన్ నుండి ఆఫ్ఘన్లు నిరంతరం రావడంతో హెరాత్ ప్రావిన్స్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. తాజా పరిస్థితిపై ఆఫ్ఘన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వహీదుల్లా మాయర్ మాట్లాడుతూ.. దేశంలో అంటువ్యాధుల సంఖ్య పెరుగుతోంది, రాబోయే రెండు-మూడు వారాలు చాలా ఇబ్బందికరంగా ఉండే ప్రమాదం ఉందన్నారు.

అంతేకాదు పరీక్షల సామర్ధ్యం బలహీనంగా ఉందని అన్నారు. టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడానికి కాబూల్ లో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 5000 టెస్ట్ కిట్లు ఇక్కడకు వచ్చాయని.. ఈ వారం చివరి నాటికి మరో 3 వేల కిట్లు వస్తాయని.. ఇవే కాకుండా, మరో లక్ష టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ప్రపంచంలో భారీ డిమాండ్ ఉన్నందున, ఈ ఒప్పందం విజయవంతమవుతుందని స్పష్టంగా చెప్పలేమని సందేహం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories