Coronavirus : 2 వేలకు పెరిగిన మరణాల సంఖ్య

Coronavirus : 2 వేలకు పెరిగిన మరణాల సంఖ్య
x
Highlights

చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో కొత్త కరోనావైరస్ కేసులు వరుసగా రెండవ రోజు పడిపోయాయి, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన అనంతరం మరణాలు సంఖ్య పెరిగింది,...

చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో కొత్త కరోనావైరస్ కేసులు వరుసగా రెండవ రోజు పడిపోయాయి, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన అనంతరం మరణాలు సంఖ్య పెరిగింది, అయితే కరోనావైరస్ అంటువ్యాధి మందగించిందో లేదో తెలుసుకోవడానికి ఇంకా తగినంత డేటా మాత్రం లేదు. హుబీ ప్రావిన్స్‌లో మంగళవారం నాటికి 1,693 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 1,807 నమోదైతే.. ఫిబ్రవరి 11 నుండి ఈ ప్రావిన్స్ లో అత్యల్ప సంఖ్యగా ఉంది. అయితే మరణాల సంఖ్య మాత్రం 132 కు పెరిగింది, వాస్తవానికి అంతకుముందు రోజు 93 గా నమోదయింది. తాజా గణాంకాలతో చైనాలో మొత్తం 2 వేల మరణాలుగా నమోదయ్యాయి. అలాగే కేసులు మొత్తం 74,000 కు పైగా నమోదయ్యాయి.

మరోవైపు కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనా కేంద్ర నగరమైన వుహాన్ లో ఒక ప్రముఖ ఆసుపత్రి అధిపతి మంగళవారం కోవిడ్ - 19 తో మరణించారు. దీంతో వైరస్ భారిన పడి మృతిచెందిన వైద్యులలో ఆయన రెండవ ప్రముఖ వ్యక్తి అయ్యారు. వుహాన్ వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లియు జిమింగ్ ఉదయం 10:30 గంటలకు మరణించారని అధికారిక టెలివిజన్ వెల్లడించింది. కాగా ఈ నెల ప్రారంభంలో, కరోనావైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లి వెన్లియాంగ్ మరణానికి చైనాలో లక్షలాది మంది సంతాపం తెలిపారు.

లి మరణం మాదిరిగా , సోమవారం రాత్రి లియు పరిస్థితి గురించి చైనా ఇంటర్నెట్‌లో గందరగోళం నెలకొంది. మొదట ఆయన చనిపోయారని ఓ కమ్యూనిస్ట్ కమిషన్ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. ఆ తరువాత సజీవంగానే ఉన్నారని.. తెలిపింది. ఈ క్రమంలో నిన్న ఉదయం మరణించారని చైనా అధికారిక టెలివిజన్ స్పష్టం చేసింది. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్త వృద్ధి మరియు కార్పొరేట్ లాభాలపై వైరస్ వ్యాప్తి ప్రభావంతో చమురు ధరలు పడిపోయాయి.. అంతేకాదు ఆపిల్ ఇంక్ (AAPL.O) ఈక్విటీ మార్కెట్లు పడిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories