రష్యాలో కొనసాగుతోన్న కరోనా ఉధృతి.. కొత్తగా కేసులు చూస్తే..

రష్యాలో కొనసాగుతోన్న కరోనా ఉధృతి.. కొత్తగా కేసులు చూస్తే..
x
Representational Image
Highlights

రష్యాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఇక్కడ 9 వేల 434 కేసులు నమోదయ్యాయి.

రష్యాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఇక్కడ 9 వేల 434 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య మొత్తం సంఖ్య మూడు లక్షలు దాటింది. మరోవైపు ఆరోగ్య కార్యకర్తల భద్రత గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. గత వారం, కొంతమంది వైద్యులు తమకు పిపిఇ కిట్లతో సహా కొన్ని భద్రతా పరికరాలు లేవని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఒక ప్రకటన చేయలేదు. ఇక రష్యాలో మొత్తం మూడు లక్షలా ముప్పైఆరువేల పాజిటివ్ కేసులుంటే.. ఇందులో ఒక లక్షా 8 వేలమంది కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 3,388 మంది కరోనా కాటుకు బలయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories