కన్నీటిలోనూ కరోనా.. ఇటలీలో బయటపడ్డ విషయం!

కన్నీటిలోనూ కరోనా.. ఇటలీలో బయటపడ్డ విషయం!
x
Representational Image
Highlights

కంటికి కనిపించదు కానీ, కంట్లోనే తిష్ట వేస్తుందట కరోనా! విస్మయం కలిగిస్తున్న ఈ విషయాన్ని ఇటలీలో కనుగొన్నారు.

కంటికి కనిపించదు కానీ, కంట్లోనే తిష్ట వేస్తుందట కరోనా! విస్మయం కలిగిస్తున్న ఈ విషయాన్ని ఇటలీలో కనుగొన్నారు. ఇన్నాళ్ళూ కరోనా వైరస్ కేవలం ఊపిరితిట్టుల్లోనే ఉంటుంది అనుకున్నారు. అంతేకాకుండా లాలాజలం, ముక్కునుంచి వచ్చే చీమిడి, దగ్గు నుంచి వచ్చే ఉమ్మి వంటి వాటిలోనే కరోనా కనిపిస్తుందనీ, వ్యాపిస్తుందనీ అనుకున్నారు. కానీ. ఈ కొత్త విషయంతో కన్నీటితో కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కీలక విషయం తెలిసిందిలా..

చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రమైన ఉహాన్ నుంచి 65 ఏళ్ల మహిళ ఇటలీకి వెళ్లింది. ఐదు రోజుల తర్వాత ఆమెలో 'కోవిడ్-19' లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె హాస్పిటల్‌లో చేరింది. పొడి దగ్గు, గొంతు నొప్పి, మగత, ముక్కు నుంచి నిరంతరాయంగా చీమిడి కారడం, కళ్లు గులాబీ రంగులోకి మారిపోవడం చూసిన వైద్యులు.. ఆమెకు పరీక్షలు చేయగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన జ్వరం, వికారం, వాంతులతో నరకయాతన అనుభవించింది.

ఆమె హస్పిటల్‌లో ఉన్న మూడో రోజు వైద్యులు ఆమె కళ్లను శుభ్రం చేశారు. ఆర్ఎన్ఏలో వైరస్‌ను కనుగొన్నారు. ఆమె కరోనాకు చికిత్స పొందిన అన్ని రోజులు ఆమె కళ్ల నుంచి నీరు కారుతూనే ఉంది. నర్సులు ఎప్పటికప్పుడు ఆ నీటిని శుభ్రం చేస్తూ పరీక్షలకు పంపుతూనే ఉండేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజేస్ నిర్వహించిన పరిశోధనలో కీలక విషయం తెలిసింది.

కరోనా వైరస్‌కు గురైన వ్యక్తుల్లో లక్షణాలు బయటపడిన 21 రోజుల తర్వాత కూడా వైరస్ కళ్లలోనే ఉంటోందని తెలుసుకున్నారు. పైన పేర్కొన్న రోగిలో కూడా ఈ లక్షణమే బయటపడింది. కరోనాకు చికిత్స అందుకున్న 27వ రోజున ఆమె ముక్కు నుంచి సేకరించిన శాంపిల్‌లో వైరస్ కనిపించలేదు. అయితే, ఆమె కంటి నుంచి సేకరించిన శాంపిల్స్‌లో మాత్రం వైరస్ జీవించే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాకు వైద్యం అందించే డాక్టర్లు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తించాలని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తమ సూచనల్లో ఈ విషయాన్ని చేర్చింది. ముక్కు, నోరు, కళ్లు ముట్టుకున్న తర్వాత చేతులను తప్పకుండా శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. అందువలన కరోనా వైరస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories