coronavirus : చైనా వెళ్ళలేదు.. కానీ అక్కడ కేసులు నమోదు..

coronavirus : చైనా వెళ్ళలేదు.. కానీ అక్కడ కేసులు నమోదు..
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 కు పెరిగింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో...

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 కు పెరిగింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,380 కు పెరిగింది. కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయి. మరో 23 దేశాలలో సుమారు 100 కేసులు నిర్ధారణ అయ్యాయి. కేసులను ధృవీకరించిన దేశాలు మరియు భూభాగాలు ఇలా ఉన్నాయి.. థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ , సింగపూర్ , తైవాన్ , ఆస్ట్రేలియా, మలేషియా, మకావు, రష్యా , ఫ్రాన్స్ ,

యునైటెడ్ స్టేట్స్ , దక్షిణ కొరియా , జర్మనీ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , కెనడా , బ్రిటన్ , వియత్నాం , ఇటలీ, ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, కంబోడియా , శ్రీలంక , ఫిన్లాండ్ , స్వీడన్ మరియు స్పెయిన్ ఉన్నాయి. అయితే ఇందులో థాయిలాండ్, తైవాన్, జర్మనీ, వియత్నాం , జపాన్ , ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో నమోదైన కేసులలో చైనాకు రాని రోగులు ఉండటం విశేషం. మరోవైపు గ్లోబల్ ట్రావెల్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ సిరియం ప్రకారం , చైనాలో ఈ భయంకర వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి దాదాపు 10,000 విమానాలు రద్దు చేసినట్టు వెల్లడించింది.

ఇదిలావుంటే చైనాలో కరోనావైరస్ కు మూలమైన వుహాన్ నగరం జనవరి 23 నుంచి లాక్‌డౌన్ కింద ఉంది. వైరస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు రవాణా, దుకాణాలు, వ్యాపారాలు కూడా మూసివేశారు. ఇళ్లలోపలే ఉండాలని ప్రజలకు సూచించారు. వేలాదిమంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా వుహాన్‌ సిటీకి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. మొదటి విడతలో 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు. వచ్చిన వారిలో ఏపీకి చెందిన 56 మంది ఇంజనీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories