యుఎస్‌లో 24 గంటల్లో 2,333 మంది మృతి

యుఎస్‌లో 24 గంటల్లో 2,333 మంది మృతి
x
Highlights

జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ ట్రాకర్ ప్రకారం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనావైరస్ మరణాలు 24 గంటల్లో 2,333 సంభవించాయి.

జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ ట్రాకర్ ప్రకారం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనావైరస్ మరణాలు 24 గంటల్లో 2,333 సంభవించాయి. దాంతో మరణాల సంఖ్య 71,000 మందికి చేరింది. మరియు 12 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, గత ఒక వారంలో దేశంలో కొత్త కేసులు మరియు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అమెరికా చెబుతోంది.

మరోవైపు ముఖానికి మాస్కు లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అరిజోనాలోని మెడికల్ మాస్క్ ఫ్యాక్టరీలో పర్యటించారు, వాషింగ్టన్ నుండి అరుదైన యాత్ర చేసి, నవంబర్ ఎన్నికలలో గెలవాలని ఆశిస్తున్న ట్రంప్ అందులో భాగంగా మాస్క్ లేకుండా ఫ్యాక్టరీని సందర్శించి ప్రజలకు భరోసా కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం హనీవెల్ ఇంటర్నేషనల్ లో ఇంక్ ఫ్యాక్టరీని సందర్శించారు, ఇక్కడ ఆరోగ్య కార్యకర్తలకు N95 ఫేస్ మాస్క్‌ తయారవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories