ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు.. భారీగా పెరుగుదల..

ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు.. భారీగా పెరుగుదల..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కోవిడ్ వ్యాధి భారిన పడి ప్రతి రోజు వేలాది మంది మరణిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కోవిడ్ వ్యాధి భారిన పడి ప్రతి రోజు వేలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 2,182,058 లక్షలకు చేరుకుంది. ఇందులో మొత్తం లక్షా 45 వేల మంది చనిపోయారు. అలాగే మహమ్మారి భారిన పడిన 5.5 లక్షల మంది కోలుకొని అందులో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాలు, డిశ్చార్జ్ కేసులు పోను ఇప్పుడు 1,483,991 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అమెరికాలో 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదైతే. గత 24 గంటల్లోనే కొత్తగా 29 వేల కేసులు నమోదయ్యాయి.

అంతేకాదు ఒక్క రోజులోనే 4 వేల మంది పైచిలుకు రోగులు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 35 వేల మంది కరోనా బారిన పడి తనువు చాలించారు. అమెరికా తర్వాత యూకేలో గురువారం ఒక్కరోజే 861 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఫ్రాన్స్‌లో 753 మంది, ఇటలీలో 525 మంది, స్పెయిన్‌లో 503 మంది, బెల్జియంలో 417 మంది, జర్మనీలో 248 మంది, బ్రెజిల్‌లో 190 మంది, కెనడాలో 181 మంది నెదర్లాండ్స్‌లో 181 మంది, స్వీడన్‌ లో 130 మంది, టర్కీలో 125 మంది కోవిడ్ భారిన పడి మృతి చెందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories