క్రూయిజ్ షిప్‌లో 61 మందికి 'కరోనావైరస్' పాజిటివ్

క్రూయిజ్ షిప్‌లో 61 మందికి కరోనావైరస్ పాజిటివ్
x
Highlights

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధలో ఉన్న క్రూయిజ్ షిప్‌లోని మరో 41 మందికి పరీక్షలు చేయగా వారికీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో క్రూయిజ్ షిప్‌లో కరోనా...

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధలో ఉన్న క్రూయిజ్ షిప్‌లోని మరో 41 మందికి పరీక్షలు చేయగా వారికీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో క్రూయిజ్ షిప్‌లో కరోనా కేసులు సంఖ్య మొత్తం 61 కి చేరుకుందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబు కటో శుక్రవారం తెలిపారు. సుమారు 3,700 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్న డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌ ప్రస్తుతం యోకోహామాలో నిర్బంధంలో ఉంది. అక్కడ కనీసం 14 రోజులు నిర్బంధంలో ఉన్న తరువాత వారి పరిస్థితిని బట్టి నిర్ణయాలు ఉంటాయని జపాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

మూడో విడతలో మొత్తం 270 మంది అనుమానితులను పరీక్షించారు. గురువారం ఫైనల్ బ్యాచ్ రిజల్ట్ వచ్చింది. దాంతో వారిలో కొత్తగా 41 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే గతం లోనూ 20 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ 20 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించామని, కొత్తగా ధృవీకరించబడిన 41 మందిని టోక్యో చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రిఫెక్చర్లలోని వైద్య కేంద్రాల్లోకి తరలిస్తామని కటో తెలిపారు.

మరోవైపు జపాన్‌లో కరోనా వైరస్ మరణాలు సంభవించలేదని.. డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ 14 రోజుల నిర్బంధలో అక్కడే ఉండాల్సి ఉంటుందని జపాన్ ఆరోగ్య అధికారులు అరటా యమమోటో , ఫిల్ హెల్సెల్ తెలిపారు. కాగా హాంకాంగ్‌లో కరోనావైరస్ కోసం పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రయాణీకుడు గత నెల చివర్లో ఈ ఓడ ఎక్కాడు దాంతో ఈ వైరస్ అందరికి సోకింది.

ఇదిలావుంటే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చైనా భూభాగంలో 636 మంది మరణించారు. అలాగే ఫిలిప్పీన్స్ లో ఒకరు హాంకాంగ్ లో మరొకరు ఈ వైరస్ బారిన పడి మృతిచెందారు. గురువారం 69 మరణాలు హుబీ ప్రావిన్స్‌లో సంభవించాయి. ఇక్కడే కరోనా వైరస్ పుట్టింది. శుక్రవారం ఉదయం నాటికి చైనాలో 31,000 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories