ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు
x
Highlights

* 24 గంటల్లో భారీగా 6 57,312 కరోనా కేసులు * వివరాలు వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ * యూరప్ దేశాల నుంచే అత్యధిక కేసులు * కరోనా కాటుకు ఒక్కరోజులో 9,797 మంది బలి * అమెరికాలో కోటి దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీగా 6 57,312 కరోనా కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ..W.H.O తాజాగా వెల్లడించింది. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు యూరప్ దేశాల నుంచే నమోదైనట్టు తెలిపింది. గడచిన 24 గంటల్లో యూరప్ వ్యాప్తంగా 2.85 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 32 లక్షలకు చేరువలో ఉంది.

మరోపక్క ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా 9,797 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్టు W.H.O వెల్లడించింది. కొత్తగా నమోదైన మరణాలతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13,00,576గా ఉంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా కేసులు నమోదైతే.. ఇందులో కోటికి పైగా కేసులు ఒక్క అమెరికా నుంచే బయటపడ్డాయి. ఇక అమెరికా తరువాతి స్థానాల్లో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా దేశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories