కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ ఉంటుందా? వీరి వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందా?

కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ ఉంటుందా? వీరి వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందా?
x
Representational Image
Highlights

ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారితో కొంత మంది కరోనా వైరస్ బారినుంచి బయటపడి డిశ్చార్జి కూడా అవుతున్నారు. అయితే కరోనా వైరస్ బారి నుంచి బయటపడిన వారి నుంచి కూడా కోవిడ్-19 సంక్రమించే ప్రమాదం ఉందా అంటే ఉందనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అసలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి నియంత్రించడం ఎందుకు కష్టమవుతోందన్న విషయాలపై అమెరికాలోని యేల్ యూనివర్సిటీ, చైనాలోని పీఎల్ఏ జనరల్ హాస్పిటల్ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న తరువాత కూడా ఎనిమిది రోజుల వరకూ వారిలో కరోనా వైరస్ ఉంటుందని తెలుసుకున్నారు. వారిలో వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపించకపోయినా కణాలు 8రోజుల వరకు వారి శరీరంలోనే ఉంటాయని ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ పరిశోధనలు చేసిన బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ కూడా ఉండడం గమనార్హం.

కరోనా వైరస్ విజృంభించిన తరువాత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 వరకు బీజింగ్‌లోని పీఎల్ఏ జనరల్ ఆస్పత్రిలో 16మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారు కోలుకున్నాక శాస్త్రవేత్తలు వారికి వరుసగా రెండుసార్లు 'పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌' (పీసీఆర్‌) పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో వారికి వైరస్‌ లేదని నిర్ధారణ అయిన వెంటనే వారిని హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి చేశారు. వారు కోలుకుని డిశ్చార్జ్ అయిన తరువాత కూడా వారికి రోజు విడిచి రోజు పరీక్షలు చేస్తూనే ఉన్నారు. బాధితుల గొంతు నుంచి నమూనాలను సేకరించి శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే వారు కోలుకున్న తరువాత కూడా ప్రాథమికంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి తలెత్తడంతో వారికి పలు రకాల ఔషధాలను ఇచ్చారు. అయితే వ్యాధి లక్షణాలు తగ్గిన తరువాత కూడా చాలా మంది ఈ వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.

ఈ విషయం తాము చేసిన పరిశోధనల్లో వెల్లడయ్యిందని శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ తెలిపారు. ఇక వైరస్ సోకి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి ఐదు రోజుల సమయం పడుతుంది. ఈ వ్యాధి లక్షణాలు మనిషి శరీరంలో 8 రోజుల పాటు ఉంటున్నాయని తెలిపారు. ఈ వైరస్ సోకిన వారికి స్వల్పస్థాయి శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారు మిగతా ప్రజలకు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు గాను కరోనా నుంచి కోలుకున్న వారిని మల్లీ రెండు వారాల పాటు క్వారంటైన్‌ ఉంచాలని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త లిక్సిన్ షీ సూచించారు. వ్యాధి లక్షణాల నుంచి ఇటీవలే కోలుకున్న వారికి కూడా లక్షణాలు ఉన్న వారికి ఏవిధమైన చికిత్స అందజేస్తారో అదే తరహా చికిత్స అందజేయాలని తెలియజేశారు.

ఇలా చేస్తూ జాగ్రత్త పడడం వలన ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్రమణ తరువాతి దశలలో వైరస్‌ను ఏవిధంగా ప్రసారం చేయగలదా అని పరిశోధించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని ఆయన చెప్పారు. వృద్ధులు, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, చికిత్స తీసుకుంటున్న రోగులకు ఇలాంటి ఫలితాలు నిజమవుతాయా అనేది అస్పష్టంగా ఉందని ఈ పరిశోదనల్లో గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories