Coronavirus: కొడుకును దగ్గరకు తీసుకోలేక కన్నీళ్ళపర్యంతమైన వైద్యుడు .. వీడియో వైరల్

Coronavirus: కొడుకును దగ్గరకు తీసుకోలేక కన్నీళ్ళపర్యంతమైన వైద్యుడు .. వీడియో వైరల్
x
Highlights

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రజలందరూ తమతమ ఇళ్లలోఉంటే, వైద్యులు మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడటానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ కరినపై చేసే పోరాటంలో ఆకలిని సైతం లెక్కచేయడం లేదు. ఈ సమయంలో కుటుంబానికి, తమ పిల్లలకు, దూరంగానే ఉండవలసి రావటం వారికి బాధాకరంగా ఉంది. అయితే ఒక వైద్యుడు తన విధులను ముగించుకొని ఇంటికి వచ్చి తన కోసం వచ్చిన బిడ్డను ముద్దాడలేక దూరంగా ఉండిపోయడు. దీనికి సంబంధించిన ఆరు సెకన్ల వీడియో ఒకటి నెటిజన్ల కన్నీళ్లు తెప్పిస్తుంది.

సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడిని తన కుమారుడు గురించిన ఈ వీడియోలో ఉంది. తన తండ్రి ఇంటికి రావటాన్ని గమనించి కుమారుడు పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి మాత్రం చిన్నారిని దూరాన్నే ఆపేయటంతో ఆ బాలుడికి అర్థం కాదు. తన కొడుకును దగ్గరకు తీసుకోలేని పరిస్థితిని భరించలేక ఆ వైద్యుడు కన్నీళ్లపర్యంతమవుతాడు. ఈ వీడియోను నెటింట్లో హల్ చల్ చేస్తుంది. ఇది చాలా బాధాకరమైనప్పటికీ ఆ వైద్యుడు రియల్‌ హీరో అని ఆ బాబుకు తండ్రి ప్రేమ దక్కాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories