ఇరాన్‌, ఇటలీ, స్పెయిన్‌ లో కరోనా కల్లోలం

ఇరాన్‌, ఇటలీ, స్పెయిన్‌ లో కరోనా కల్లోలం
x
Coronavirus (File Photo)
Highlights

ప్రపంచదేశాల్లో కరోనా విధ్వంసం కొనసాగుతోంది.157దేశాల్లో కరోనా కాటుకు 6515మంది మృతి చెందగా.. 1,69, 415మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ప్రపంచదేశాల్లో కరోనా విధ్వంసం కొనసాగుతోంది.157దేశాల్లో కరోనా కాటుకు 6515మంది మృతి చెందగా.. 1,69, 415మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చైనాలో మృతుల సంఖ్య 3213కు చేరగా.. బాధితుల సంఖ్య 80859కి పెరిగింది. ఇరాన్‌, ఇటలీ, స్పెయిన్‌ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇటలీలో 1809మంది బలికాగా 24,747పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇరాన్‌ లో 724మంది చనిపోతే 13,938కి కేసుల సంఖ్య పెరిగింది.

స్పెయిన్‌ లో 292మంది మరణిస్తే.. నిన్న ఒక్కరోజే 1452కొత్త కేసులు వెలుగులోకి రాగా 7845మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. సౌత్‌ కొరియాలో 75మంది చనిపోతే.. బాధితుల సంఖ్య 8162కు చేరింది. ఇటు అమెరికాలో మృతుల సంఖ్య 68కి పెరగగా..3719 పాజిటీవ్‌ కేసులు నమోదు అయినట్టు అధికారులు దృవీకరించారు. ఫ్రాన్స్‌ లో కరోనా 127మంది ప్రాణాలు హరించగా..మరో 5423మంది చికిత్స పొందుతున్నారు. కరొనా కట్టడికి ఫిలిప్సైన్స్‌ రాజధాని మనీలాను మూసివేశారు.

అమెరికా, యూకే, పాకిస్థాన్‌, ఫ్రాన్స్‌లో స్కూళ్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేశారు. యూరప్‌ దేశాలు పొరుగుకు నో ఎంట్రీ అంటున్నాయి. డెన్మార్మ్‌ సరిహద్దులు మూసివేసింది. పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా ఇదే బాట పట్టాయి. నార్వే, పోలాండ్‌ తో సరిహద్దులు మూసివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కజకిస్థాన్‌, సాల్వెడార్‌లు అత్యవసర పరిస్థితి ప్రకటించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories