logo

దారుణం : ఖైదీల నగ్న శరీరాలపై కోళ్ల పందెం

దారుణం : ఖైదీల నగ్న శరీరాలపై కోళ్ల పందెం
Highlights

దారుణం : ఖైదీల నగ్న శరీరాలపై కోళ్ల పందెం దారుణం : ఖైదీల నగ్న శరీరాలపై కోళ్ల పందెం

ఖైదీలను శిక్షించడానికి వెనిజులాలోని ఓ జైలు అధికారులు వినూత్న పద్ధతిని పాటిస్తున్నారు. కొన్నిరోజులుగా సరైన తిండి, నీరు ఇవ్వడం లేదంటూ నిరసన చేపట్టిన ఖైదీలను నగ్నంగా నేలపై పడుకోబెట్టి వారి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు జైలు అధికారులు. గతవారం అనాకోలోని పోలీస్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం అనాకోలోని పోలీస్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లోని ఖైదీలు కొద్దినెలలుగా జైలు అధికారులు తమకు సరిపడా ఆహారం, నీరు ఇవ్వటం లేదని తమ బంధువులు చూడటానికి వచ్చినపుడు కూడా అనుమతించడం లేదని.. అనారోగ్యానికి గురైతే తమ బంధువులు తెచ్చే మెడిసిన్స్‌ కు కూడా అనుమతి ఇవ్వడం లేదని నిరసిస్తూ.. జైల్లోనే ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు.

దాదాపు 70మంది ఖైదీలను 2 గంటల పాటు విచక్షణా రహితంగా కొట్టారు. అంతేకాకుండా వారి దుస్తులను బలవంతంగా విప్పేసి నేలపై పడుకోబెట్టి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. ఆ కోళ్లకు కట్టిన కత్తులు వారి శరీరాలను తీవ్రంగా గాయపరిచాయి.ఈ క్రమంలో అన్నం, నీరు లేక స్పృహ కోల్పోయారు. ఆ తరవాత కొన్ని గంటలు వారికి తిండి, నీరు కూడా ఇవ్వలేదు. ఈ విషయం వెనిజులాకు చెందిన ఓ రిపోర్టర్‌ కు తెలియటమే కాక ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఘటనపై స్పందించిన వెనిజులా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


లైవ్ టీవి


Share it
Top