Aliens Attack: సోవియట్ సైనికులపై గ్రహాంతర వాసులు దాడి.. సీఐఏ ఫైల్ వైరల్

CIA file
x

CIA file: సోవియట్ సైనికులపై గ్రహాంతర వాసులు దాడి.. సీఐఏ ఫైల్ వైరల్

Highlights

Aliens Attack: సోవియట్‌ సైనికులపై గ్రహాంతర వాసులు దాడులు చేశాయి అనే వార్త వైరల్ గా మారుతుంది. కొన్నేళ్ల క్రితం ఇది బహిర్గతం చేసిన ఫైల్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

CIA File Viral: సోవియట్ సైనికులపై గ్రహాంతరవాసులు దాడి చేశాయి అనే ఫైల్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కొన్నాల క్రితం విడుదల చేసిన ఈ ఫైల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

సోవియట్‌ సైనికులపై ఉక్రెయిన్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో గ్రహాంతర వాసులు దాడి చేశాయని వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త డీ క్లాసిఫైడ్ చేశారు. కెనడా వార్తాపత్రిక వీక్లీ న్యూస్, ఉక్రెయిన్ పేపర్ హోలో రిపోర్టు ఈ కథనం బహిర్గతం చేశాయి. అంతేకాదు జోరోగాన్ ఎక్స్పీరియన్స్ పాడ్‌ కాస్ట్ లో కూడా దీనిని ప్రస్తావించారు. ఆ సమయంలో సైనికులు కాల్పులు జరిపారు అప్పుడు గ్రహాంతర వాసులు కూడా ఎదురు దాడి చేసినట్టుగా సిఐఏ పేర్కొంది. ఇందులో 23 మంది సైనికుల పారిపోవడానికి ప్రయత్నించిన కానీ రక్తం గడ్డుకుపోయినట్లు తెలుస్తోంది.

ఈ గ్రహాంతర వాసుల దాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఉన్నట్టు న్యూయార్క్ పోస్టు కూడా ఓ పత్రిక కథనం ప్రచురించింది. దీనికి సంబంధించిన చిత్రాలు వాంగ్మూలాలు కూడా సేకరించారు. వివరాల ప్రకారం సోవియట్ సైనిక బృందం ఉక్రెయిన్ లో శిక్షణ పొందుతున్న సమయంలో యూఎఫ్ఓ సాసర్‌ ఎగురుతూ కనిపించింది. అప్పుడు వీళ్ళు ఓ క్షిపణి కూడా ప్రయోగించగా దాన్ని తాకి క్రాష్ ల్యాండ్ అయిపోయింది. ఆ సమయంలో అక్కడి అందులో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటకు వచ్చాయి అని ఆ రిపోర్ట్ లో పేర్కొని ఉంది. ఆ సమయంలో వారు వద్ద ఉన్న పరికరాలతో ఎదురు దాడి చేసినట్లు తెలిసింది.

అయితే ఆ ఆకారాలు సైనికులు బిగుసుకుపోయేలా చేసినట్లు ఆ ఫైల్‌లో ఉంది. ఈ ఘటన పద్యం 1989 నుంచి 90 మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడా వరల్డ్ న్యూస్ తెలిపింది. అయితే పూర్తిగా ఇది ఊహాజనిత కథనం అనిపిస్తున్న సీఐఏ ఫైల్స్ లో ఉండటం గమనార్హం. అయితే అందులో ఒక ఏజెంట్ మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఫైల్‌ పలువురు చేతులు మారి వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ సమాచారం నుంచి వచ్చింది కాదని ఆ తర్వాత ప్రచురించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories