కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది : చైనా వైరాలజిస్ట్ సంచలనం

కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది : చైనా వైరాలజిస్ట్ సంచలనం
x
Highlights

నొవెల్ కరోనావైరస్ వుహాన్ ప్రయోగశాలలోనే తయారైందని.. ఇందుకు శాస్త్రీయ రుజువు కూడా ఉందని ఒక చైనీస్ వైరాలజిస్ట్ తన వీడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లోని..

నొవెల్ కరోనావైరస్ వుహాన్ ప్రయోగశాలలోనే తయారైందని.. ఇందుకు శాస్త్రీయ రుజువు కూడా ఉందని ఒక చైనీస్ వైరాలజిస్ట్ తన వీడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌లో పనిచేస్తున్న డాక్టర్ లి-మెంగ్ యాన్ అనే చైనీస్ శాస్త్రవేత్త, కరోనావైరస్ పై గత సంవత్సరం నుండి పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు. వుహాన్లో న్యుమోనియాపై తన దర్యాప్తులో, కరోనావైరస్ గురించి తెలుసుకున్నానని.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ విషయాన్నీ నివేదిస్తే అక్కడినుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె అన్నారు. ప్రపంచం ఎదుర్కోబోయే ప్రమాదం గురించి ముందుగానే తెలుసుకున్నప్పటికీ చైనా అధికారులు తన హెచ్చరికలను పట్టించుకోలేదని అన్నారు. కరోనాను వుహాన్‌లో తయారు వైరస్ అని ఆ ల్యాబ్ మరియు ప్రత్యేక ప్రయోగశాలను చైనా ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్‌ ల్యాబ్‌లోనే ఉద్భవించిందనడానికి తన దగ్గర సరైన సాక్షాలు ఉన్నాయని అన్నారు. ప్రపంచాన్ని మభ్యపెట్టడానికే జంతు మాంసం మార్కెట్‌లో కరోనా వైరస్ పుట్టిందని ప్రచారం చేశారని ఆమె అన్నారు. కరోనా మానవ ప్రసారం ఇప్పటికే ఉందని.. ఈ విషయం చైనా అధికారులకు కూడా తెలుసునని అన్నారు.. అధిక జన్యుపరివర్తన కలిగిన సార్స్-కోవి-2 వ్యాప్తి మొదలైతే ఎవరూ నియంత్రించలేరనే విషయం కూడా చైనా అధికారులకు తెలుసని చెప్పారు. వైరస్ పై అప్రమత్తం చేస్తే.. చైనా అధికారులు బెదిరించారని.. దాంతో ప్రాణభయంతో తాను అమెరికాకు పారిపోవలసి వచ్చిందని ఆమె చెప్పారు. తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు పరిశోధనకు చెందిన సమాచారం మొత్తం ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories