China New Train: చైనా అద్బుతం.. గంటకు 600 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు

China Maglev Train 600km Speed Worlds Fastest Rail
x

China New Train: చైనా అద్బుతం.. గంటకు 600 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు

Highlights

China New Train: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చైనాను మించిన దేశం లేదు. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.

China New Train: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చైనాను మించిన దేశం లేదు. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా గంటకు అత్యధికంగా 600 కిమీ వేగంతో ప్రయాణించే రైలుని ఇటీవల ప్రారంభించింది. ఇది విమానంతో పోటీపడుతూ వెళుతుందని చైనా చెబుతుంది. ఆ వివరాలు చూద్దాం.

కొత్త కొత్త ఆవిష్కరణలో చైనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. మొన్నటివరకు హై స్పీడ్ ట్రైన్ పైన దృష్టిసారించిన చైనా ఇప్పుడు తాజాగా విమానంతో పోటీ పడే ఒక సరికొత్త రైలును సృష్టించింది. ఇది గంటకు అత్యధికంగా 600 కిమీ వేగంతో ప్రయాణించగలదని చైనా చెబుతోంది.

ఇటీవల బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సరికొత్త మ్యాగ్లెవ్ మోడల్ రైలనును చైనా ప్రదర్శించింది. ఈ ట్రైన్ కేవలం 7 సెకన్లలో 600 కిమీ వేగాన్ని అందుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంగై మధ్య ఉన్న 1200కిమీ దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి 5.30 గంటలకు పడుతుంది. ఇక ఈ రైలు వస్తే గనక.. రెండు గంటల 10నిమిషాల్లో చేరిపోవచ్చు.

ఈ రైలు విమానంతో పోటీపడి మరీ ప్రయాణించగలదు. ఇందులో ఉండే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంత వేగాన్ని పుంజుకుంటుంది. ఈ సాంకేతికత వ్యతిరేక అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకుని ట్రాక్ నుంచి రైలుని పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుగుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని ఈ కార్యక్రమంలో అధికారులు వెల్లడించారు.

ఈ రైలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీని బరువు దాదాపు 1.1 టన్నులు. ఈ రైలును చూస్తే ఏదో బుల్లెట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ కొత్త ఆవిష్కరణతో చైనా ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఇప్పటికే ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం చైనాలో హైస్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దదిగా మారింది. గతేడాది చివరి నాటికి మొత్తం 48వేల కి మీ ఇది విస్తరించింది. ఈ ఏడాది దీన్ని 50 వేలకు విస్తరించాలని బీజింగ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ రైళ్లలో స్పెషల్ ట్రైన్ సీఆర్450. ఇదొక బుల్లెట్ ట్రైన్. ఇది గంటకు 450 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఇక ఇప్పుడు చైనా ఖాతాలో గంటకు 600 కిమీ వేగంతో అది కూడా విమానంతో పోటీపడే రైలు రావడంతో.. చైనా కొత్త ఆవిష్కరణలు చేయడంతో తిరుగులేని దేశంగా నిలబడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories