Praful Bakshi: సరిహద్దుల్లో చైనా అత్యుత్సాహం

China Is Zealous On Borders
x

సరిహద్దుల్లో చైనా అత్యుత్సాహం

Highlights

Praful Bakshi: సైనిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

Praful Bakshi: సరిహద్దుల్లో చైనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దొంగదెబ్బ కొట్టేందుకు చూస్తోందని రక్షణ శాఖ మాజీ అధికారిక ప్రఫుల్ భక్షి ఆగ్రహించారు. సరిహద్ధులో ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాను నమ్మకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆధీనరేఖ వద్ద చైనా సైన్యం దుర్మార్గానికి పాల్పడుతోందన్నారు. ఎప్పటికప్పు శాంతించినట్లు కన్పించి దొంగసాకులతో అడపాదడపా భారత సైనికబలగాలను పొట్టన బెట్టుకుంటొందని ఆవేదన వ్యక్తంచేశారు. పాలకులు మేల్కొని తగిన గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు.

చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ సెక్టార్‌ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఈ నెల 9న ఘర్షణ జరగ్గా ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఎల్‌ఏసీ సమీపంలోకి చైనా సైనికులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ నెలకొన్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిన ఇరు దేశాల సైనికాధికారులు అక్కడ ఫ్లాగ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, జూన్‌ 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనలో 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. దీంతో సరిహద్దులో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అనంతరం రెండు దేశాలు సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. వీటి ఫలితంగా ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనికులను వెనక్కి రప్పించాయి. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories