Top
logo

కంగారు పెడుతున్న కరోనా వైరస్.. ఎందుకు..ఎలా వస్తుంది? లక్షణాలివే!

కంగారు పెడుతున్న కరోనా వైరస్.. ఎందుకు..ఎలా వస్తుంది? లక్షణాలివే!
X
Highlights

ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను ప్రస్తుతం ఓ వైరస్ వణికించేస్తోంది. చైనాలో మారుమూల ప్రదేశంలో వెలుగులోకి వచ్చిన ఈ ...

ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను ప్రస్తుతం ఓ వైరస్ వణికించేస్తోంది. చైనాలో మారుమూల ప్రదేశంలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు చైనా అంతటా భయంకర పరిస్థితులు సృష్టించింది. చైనా ఆర్ధిక పరిస్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదిలా ఉంటె ప్రపంచ దేశాల్లోనూ కరోనా వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానినికి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పడటమే తప్ప ఎటువంటి చికిత్సా దొరకని ఈ కరోనా వైరస్ అసలు ఎక్కడ ఎలా ప్రారంభం వెలుగులోకి వచ్చింది? చైనాలో పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ప్రబలుతోంది? అసలు ఈ వైరస్ సోకిందని గుర్తించే లక్షణాలు ఏమిటీ? వంటి వివరాలు ..

చైనా అంతా వేగంగా ఆక్రమించిన వైరస్:


చైనాలోని వుహాన్ నగరంలో మొదట కరోనా వైరస్ ను గుర్తించారు. తరువాత చైనా మధ్యభాగం హుబె ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఇక్కడ ఏకంగా 1400 కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయి. చైనాలోని మిగిలిన ప్రాంతాలనుంచి హుబె ను వేరు చేశారు. నిషేధాజ్ఞలు విధించారు.

ఇతర ప్రపంచ దేశాల్లో నూ ఉనికి..


థాయిలాండ్, వియాత్నం, తైవాన్, సౌత్ కొరియా, సింగపూర్, నేపాల్, జపాన్ వంటి ఆసియా దేశాలతో పాటు, లాస్ట్రేలియా, యూఎస్ లోనూ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారత్, బ్రిటన్, కెనడా లలో కొన్ని అనుమానిత కేసులు కనిపించినా ఇప్పటివరకూ వాటిని పరీక్షిస్తున్నారు.

కరోనా వైరస్ సోకితే ఎం జరగవచ్చు?


క్రోనా వైరస్ కు నావెల్ కరోనా వైరస్ (nCoV) అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్తగా వెలుగులోకి వచ్చిన వైరస్. ఇంతకు ముందు ఇదే కుటుంబంలో సార్స్ (సివియర ఏయోట్ రెస్ప్రెటరీ సిండ్రోమ్), మర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి ప్రమాదకర వైరస్లు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ఇప్పటివరకూ మనుషుల్లో గుర్తించలేదు. పాముల్లో ఈ వైరస్ ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ సోకిన వారికి శ్వసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దగ్గు, జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వైరస్ సోకిన వారిలో మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. తరువాత పొడి దగ్గు కనిపిస్తుంది. మెల్లగా అది శ్వాసలో ష్వాసాలో ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇవి ప్రారంభలక్షణాలు. ఇక ఈ వైరస్ వ్యాధి ముదిరితే ఇన్ఫెక్షన్ న్యుమోనియాగా మారుతుంది. కిడ్నీలు విఫలం అవుతాయి. ఈ వారిదాస్ బారిన పడేవారిలో ఎక్కువగా వృద్ధులే ఉన్నారని చైనా చెబుతోంది. ముఖ్యంగా పార్కన్సాన్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా దీనికి గురవుతున్నారంటున్నారు. ఈ వైరస్ సోకితే వదిలించుకోవడానికి ఎటువంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. కేవలం ఇన్ఫెక్షన్ వాళ్ళ వచ్చిన లక్షణాల ఆధారంగా మాత్రమే డాక్టర్లు చికిత్స నాడించగలరు. అయితే, ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాప్తిని అరికకట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ చర్యలు తప్పనిసరి..

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి అని వైద్యలు సూచిస్తున్నారు.

♦ దగ్గు తుమ్ములు వచ్చినపుడు రుమాలు వంటిది అడ్డుపెట్టుకోవడం..

♦ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం

♦ మాంసం, గుడ్లు బాగా ఉడికించి తినడం

♦ జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండడం

♦ చేతులకు సరియన్ రక్షణ లేకుండా పెంపుడు జంతువులను, ఇతర జంతువులను తాకడం చేయకూడదు.

Web TitleCarona virus symptoms and precautions
Next Story