Coronavirus: రేపటినుంచి రంగంలోకి దిగనున్న బ్రిటన్ ప్రధాని

Coronavirus: రేపటినుంచి రంగంలోకి దిగనున్న బ్రిటన్ ప్రధాని
x
British prime minister boris Johnson
Highlights

కరోనావైరస్ మహమ్మారినుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం నుంచి తిరిగి డ్యూటీలో చేరడానికి సిద్ధమయ్యారు.

కరోనావైరస్ మహమ్మారినుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం నుంచి తిరిగి డ్యూటీలో చేరడానికి సిద్ధమయ్యారు. సుమారు రెండు వారాలపాటు లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఉన్న బోరిస్.. కరోనా భారిన పడ్డా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రాణాంతక మహమ్మారి సోకినా ఏ మాత్రం భయపడకుండా దైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన కోలుకున్న తరువాత తనకు వైద్యం అందించిన వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని చెప్పారు.

అంతేకాదు వ్యాధి సోకిన వారు భయపడకుండా దీనిని ఎదుర్కోవాలని సూచించారు. ఇక బోరిస్ ఆసుపత్రిలో ఉన్న సమయాల్లో ఆయన అధికారాలను విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ నిర్వర్తించారు. ఆదివారం వరకూ ఈయనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. రేపటినుంచి బోరిస్ తన పదవీబాధ్యతల్నీ నిర్వర్తిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా బ్రిటన్ దేశంలో ఇప్పటివరకు 20 వేల 377 మంది మరణించగా, లక్ష 48 వేల 377 మంది వైరస్ సోకింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories