Donald Trump: ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ అధికారికి కరోనావైరస్ పాజిటివ్

Donald Trump: ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ అధికారికి కరోనావైరస్ పాజిటివ్
x
Highlights

శనివారం ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి హాజరైన బ్రెజిల్ ప్రభుత్వ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు...

శనివారం ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి హాజరైన బ్రెజిల్ ప్రభుత్వ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు బ్రెజిల్ ప్రభుత్వం గురువారం తెలిపింది. బ్రెజిల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ ఫాబియో వాజ్గార్టెన్ ఈ వైరస్ భారిన పడ్డారని.. అమెరికా అధ్యక్షుడి పక్కన నిలబడి ఉన్న వాజ్గార్టెన్ ఫోటోను పోస్ట్ చేసి ఆయనను కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్టు వెల్లడించింది. కాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో యొక్క కమ్యూనికేషన్ సెక్రటరీ ఫాబియో వాజ్గార్టెన్ కరోనా వైరస్ కారణంగా తన ఇంటి వద్ద నిర్బంధంలో ఉన్నారని కమ్యూనికేషన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన త్వరలోనే కోలుకొని తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది బ్రెజిల్ ప్రభుత్వం. వాజ్గార్టెన్ స్థానంలో మరొకరిని నియమించినట్టు తెలుస్తోంది.

ఇక బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా ఆ ఫొటోలో ఉన్నారు. దాంతో బోల్సోనారో వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటుందని అధ్యక్షుడి కమ్యూనికేషన్ కార్యాలయం నుండి ఒక ప్రకటన తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలో, వాజ్‌గార్టెన్ ట్రంప్ పక్కన "మేక్ బ్రెజిల్ గ్రేట్ ఎగైన్" అని రాసి ఉన్న టోపీ ధరించి ఉన్నాడు. ట్రంప్ పక్కన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ఉన్నారు.

మరోవైపు ఆ బ్రెజిల్ అధికారికి వైరస్ పాజిటివ్ అని రావడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై డోనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు సందేశం ఇచ్చారు. తాను వైరస్ బారిన పడలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని ట్రంప్ అన్నారు. ఓవల్ కార్యాలయంలో ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌తో సమావేశమైన సందర్భంగా ట్రంప్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. గురువారం నాటికి దేశంలో 60 వైరస్ కేసులు నమోదయ్యాయని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కారణంగా దేశంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories