తన ప్రాణాలు కాపాడిన ఇద్దరి వైద్యుల పేర్లను కొడుక్కి పెట్టిన బ్రిటన్ ప్రధాని

తన ప్రాణాలు కాపాడిన ఇద్దరి వైద్యుల పేర్లను కొడుక్కి పెట్టిన బ్రిటన్ ప్రధాని
x
Boris Johnson (File Photo)
Highlights

ఏప్రిల్ 29న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కాబోయే భర్త క్యారీ సైమండ్స్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 29న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కాబోయే భర్త క్యారీ సైమండ్స్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కుమారుడికి విల్ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్ అని పేరు పెట్టారు ప్రధాని.ఈ సమాచారాన్ని క్యారీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "తమ కుమారుడికి పేరు పెట్టేందుకు గాను గత నెలలో కరోనా బారిన పడిన బోరిస్ ప్రాణాలను కాపాడిన ఇద్దరు వైద్యుల పేర్లను తీసుకున్నాము" అని ఆమె అన్నారు. ఇందులో తన తండ్రి విల్ఫ్రెడ్ జాన్సన్ పేరును కూడా యాడ్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. కాగా తన జీవిత భాగస్వామి అయిన ప్రధాని బోరిస్ ప్రాణాలు కాపాడినందుకు గాను క్యారీ సైమండ్స్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా జాన్సన్ తన భార్య నుండి విడిపోయారు. జాన్సన్ అప్పటికే నలుగురు పిల్లలకు తండ్రి. లారా లాటిస్ (26), మీలో ఆర్థర్ (24), కాసియా పీచ్ (22), థియోడర్ అపోలో (20). బోరిస్ 25 సంవత్సరాల వివాహం తరువాత ఫిబ్రవరిలో మొదటి భార్య న్యాయవాది మెరీనా వీలర్ నుండి విడాకులు తీసుకున్నారు. అయితే మొదటి భార్యతో విడాకుల అనంతరం.. 2019 క్యారీ సైమండ్స్ ను ప్రేమించారు. అయితే అప్పట్లో ఈ ఇద్దరి బంధం గురించి చర్చలు కూడా జరిగాయి. ఆ తరువాత ఆయన ప్రధాని అయ్యారు. క్యారీని బోరిస్ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.. అందుకు తగ్గట్టే గతేడాది చివర్లో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. క్యారీ మరియు బోరిస్ వివాహం చేసుకోకుండా ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories