ఇరాన్‌లోని టెహ్రాన్‌లో కూలిన విమానం

ఇరాన్‌లోని టెహ్రాన్‌లో కూలిన విమానం
x
Representational image
Highlights

-టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో కూలిన పౌరవిమానం -ప్రమాద సమయంలో180 మంది ప్రయాణికులు, సిబ్బంది

అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం మృత్యువాతపడిన విషాద ఘటన ఇరాన్ టెహ్రాన్‌లో జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం

టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

ఉక్రెయిన్ నుంచి ఇరాన్‌కు వస్తున్న బోయింగ్ 737 విమానంలో 169 మంది ప్రయాణికులు, 10 సిబ్బందితో కీవ్‌ వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికుల సహా సిబ్బంది మొత్తం 170 మంది మృతిచెందినట్టు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే నిప్పంటుకున్ని విమానం నిప్పులు కక్కుకుంటూ నేలరాలింది.

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాకేంతిక కారణాల వల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. విమానం కుప్పకూలిన వెంటనే ఇరాన్ భద్రతా సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇరాన్ అధ్యక్షుడు ట్వీట్ చేసిన గంటల్లోనే ఉక్రెయిన్ విమానం కూలిపోవడం అనుమానాలకు రేకెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories