బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన
x
Highlights

బీజేపీలో టికెట్ల రాజకీయం వేడెక్కింది. టికెట్‌ దక్కని వారు ఆగ్రఆవేశంతో ఊగిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గంఫౌండ్రి కార్యకర్తలు ఆందోళన చేశారు.

గేటర్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో టికెట్ల రాజకీయం వేడెక్కింది. టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు తీవ్ర ఆగ్రఆవేశంతో ఊగిపోతున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో పార్టీలో ఉన్న అసంతృప్తులు ఒక్క సారిగా భగ్గుమన్నారు. టికెట్‌ దక్కని వారు తమ కోపాన్ని కార్యాలయలపై ప్రదర్శిస్తున్నారు.

ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. గన్‌ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్‌పైకి శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. ఓంప్రకాష్‌కు టికెట్‌ ఇవ్వడంపై శైలేందర్‌ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓంప్రకాష్‌కు టికెట్‌ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇక రాజాసింగ్‌పై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని శైలేందర్‌ యాదవ్ ఆరోపించారు. వరుస విజయాలతో బీజేపీని రాష్ట్రంలో కాపాడుకుంటూ వస్తున్న రాజాసింగ్‌ను పక్కన పెట్టడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించారు. రాజాసింగ్‌ను గెలిపించినందుకే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తమపై కక్షగట్టారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ వల్ల తెలంగాణలో పార్టీ బలపడదని ధ్వజమెత్తారు. వాళ్లిద్దరు పార్టీలని అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories