Bill Gates Reacts to Epstein Files Allegations: ఎప్‌స్టీన్‌తో ఆ స్నేహం నా జీవితంలో పెద్ద తప్పు.. పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బిల్‌గేట్స్!

Bill Gates Reacts to Epstein Files Allegations: ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్‌లో తన పేరు రావడంపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పరిచయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, వైరల్ అవుతున్న ఈ-మెయిల్స్‌పై అసలు నిజం వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Feb 2026 7:30 AM IST
Bill Gates Reacts to Epstein Files Allegations
X

Bill Gates Reacts to Epstein Files Allegations: ఎప్‌స్టీన్‌తో ఆ స్నేహం నా జీవితంలో పెద్ద తప్పు.. పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బిల్‌గేట్స్!

Bill Gates Reacts to Epstein Files Allegations: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాను కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా విడుదలైన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein files) పై ఆయన స్పందించారు. ఎప్‌స్టీన్‌తో తనకున్న గత స్నేహం పట్ల ఆయన తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

అతడితో గడిపిన ప్రతి క్షణానికి చింతిస్తున్నా: ఆస్ట్రేలియాకు చెందిన ఒక మీడియా సంస్థతో మాట్లాడిన బిల్ గేట్స్, ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఎప్‌స్టీన్ కోసం కేటాయించిన ప్రతి క్షణానికి నేను ఇప్పుడు చింతిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ-మెయిల్‌లో ఉన్న విషయాలన్నీ నిజం కాదు. అతడు నన్ను ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని ప్రయత్నించాడా? అనే సందేహం కలుగుతోంది" అని గేట్స్ పేర్కొన్నారు.

అసలేముంది ఆ ఫైల్స్‌లో? అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో గేట్స్‌కు సంబంధించిన కొన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఎప్‌స్టీన్ తనకు తాను రాసుకున్న ఈ-మెయిల్ ప్రకారం.. బిల్ గేట్స్ రష్యా మహిళలతో సంబంధం పెట్టుకున్నారని, తద్వారా సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్‌స్టీన్ ఆరోపించాడు. ఈ విషయం భార్య మిలిందాకు తెలియకుండా ఉండటానికి గేట్స్ రహస్యంగా యాంటీబయాటిక్స్ అడిగారని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ పరిణామాల తర్వాతే గేట్స్ తనతో ఆరేళ్ల స్నేహాన్ని తెంచుకున్నారని ఎప్‌స్టీన్ రాసుకున్నాడు.

మిలిందా గేట్స్ ఘాటు స్పందన: ఈ వివాదంపై గేట్స్ మాజీ భార్య మిలిందా (Melinda Gates) ఇప్పటికే స్పందించారు. "నా వివాహ బంధంలో ఎన్నో బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బయటపడిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సింది బిల్‌గేట్స్ మాత్రమే. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని ఆమె వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాల వల్లే 2021లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారన్న వార్తలకు ఈ కొత్త విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. గేట్స్ బృందం మాత్రం ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story