logo

అత్త నుంచి అల్లుడికి.. ప్రపంచంలోనే అతి పెద్దది ఇదే..!

అత్త నుంచి అల్లుడికి.. ప్రపంచంలోనే అతి పెద్దది ఇదే..!
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యాన్ని చూశారా.. పోని ఆ ముత్యం గురించి విన్నారా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27...

ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యాన్ని చూశారా.. పోని ఆ ముత్యం గురించి విన్నారా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 కిలోలున్న ముత్యం. ఇలాంటివి దొరకడం చాలా అరుదు. పైగా ఇది ఓ వ్యక్తికి తన అత్త నుంచి వారసత్వంగా సంక్రమించింది. ఎంతో చరిత్ర కలిగిన ఆ ముత్యం ప్రస్తుతం కెనడాకు చెందిన ఫిలిపినో అబ్రహాం రెయెస్ దగ్గర ఉంది.

అబ్రహాం రెయెస్ వాళ్ల తాత 1950లో ఫిలిప్పీన్స్ లో ఒక భారీ ఆల్చిప్పనుకొన్నారు. అయితే, ఆ ఆల్చిప్ప లోపల ఇంత పెద్ద ముత్యం ఉందని ఆయనకు తెలియదు. మొలస్కా జాతి జీవులు ఈ భారీ ఆల్చిప్పలో ఇరుక్కుపోయాయి. కొన్నాళ్లకు ఆల్చిప్ప లోపల ఈ ముత్యం బయటపడింది. అక్కడ నుంచి ఇది వారసత్వంగా రెయేస్‌కు సంక్రమించింది.

ఈ ముత్యాన్ని దగ్గించుకోవాలని చాలమంది ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎంతో చరిత్ర ఉన్న ఈ అరుదైన ముత్యాన్ని రెయెస్ అమ్మనని తెగేసి చెప్పేశాడు. దీన్ని అందరూ చూసేలా మ్యూజియంలు, గ్యాలరీలకు పంపాలనుకుంటున్నారు. దానివల్ల, ఇలాంటి అరుదైన ముత్యం ఉందన్న సంగతి అందరికీ తెలుస్తుందని రెయెస్ భావిస్తున్నారు. ఈ ముత్యం విలువ రూ.1,400 కోట్లు పైనే ఉంటుందంటున్నారు నిపుణులు.

లైవ్ టీవి

Share it
Top