US Visa Ban: గ్రీన్‌ కార్డులపై ఆంక్షలు ఎత్తివేత - బైడెన్

Biden Revokes Trump Ban on Green Cards in US
x

బైడెన్ (ఫోటో హన్స్ ఇండియా ) 

Highlights

US Visa Ban: వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్నినిషేధిస్తూ.. అప్పట్లో ట్రంప్ వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Green Cards: వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్నినిషేధిస్తూ..అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేడు ఉపసంరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది వీసా పొందాలనుకు వారిని ఇబ్బంది పెట్టడంతోపాటు.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలు అమెరికాను ప్రపంచానికి దూరం చేస్తుందని తెలిపారు. అమెరికా పనిచేసే అగ్రగామి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల సేవలను ఉపయోగించుకోకుండా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ది డైవెర్సిటీ వీసా ప్రోగ్రాం (Green Card Lottery) ప్రొగ్రామ్‌పై ట్రంప్‌ నిర్ణయం హాని చేసింది. ఈ కార్యక్రమం కింద యూఎస్ ఏటా 55వేల మందికి గ్రీన్‌కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ట్రంప్ ఈ ప్రోగ్రాం ను రద్దు చేయండంతో వీసాలు పొందాలనుకున్న వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇమ్మిగ్రేషన్‌ అటార్ని కర్టిస్‌ మారిసన్‌ మాట్లాడుతూ.. బైడెన్‌ది గొప్ప నిర్ణయం అని కోనయారు. దాదాపు 5లక్షల అర్హులైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. బైడెన్‌ నిర్ణయంతో డీవీ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories