ఈనెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం

ఈనెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం
x
Highlights

చంద్రయాన్ 2 కౌంట్ డౌన్ తిరిగి ప్రారంభం కానుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో ఏర్పడిన అంతరాయాన్ని వారం రోజుల వ్యవధిలోనే అధిగమించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ...

చంద్రయాన్ 2 కౌంట్ డౌన్ తిరిగి ప్రారంభం కానుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో ఏర్పడిన అంతరాయాన్ని వారం రోజుల వ్యవధిలోనే అధిగమించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ నెల 15న జరగాల్సిన ప్రయోగం రాకెట్ లోని క్రయోజనిక్ ఇంజన్ లో సాంకేతిక లోపంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈనెల 22న ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. రెండో ప్రయోగ వేదిక నుంచి మరోసారి 20 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియతో జీఎస్ఎల్వీ మార్క్-3ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగ సన్నాహాలలో భాగంగా రాకెట్ ప్రయోగ రిహార్సల్ నిర్వహించారు ఇస్రో శాస్త్ర వేత్తలు. ఆదివారం మిషన్ రెడీనెస్ రివ్యూ ల్యాబ్ సమావేశాలు జరపనున్నారు.

ప్రపంచం యావత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-2 అంతర్జాతీయంగా తొలిసారిగా భారత శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న రహస్యాలను శోధించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2. ఇస్రో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చివరి నిమిషాల్లో మధ్యలో నిలిచిపోయిన ప్రయోగంగా చంద్రయాన్-2 మిగిలింది. లోపాన్ని ముందుగానే గుర్తించి.. రాకెట్ నింగిలోకి వెళ్ల ముందే ప్రయోగాన్ని నిలిపివేసి కోట్ల రూపాయలు వృధా కాకుండా ఇస్రో నివారించగలిగింది.

వారం రోజుల వ్యవధిలోని లోపాలు సవరించుకుని తిరిగి ప్రయోగానికి సిద్ధం కావడంతో అందరిలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని దేశం యావత్ అభినందిస్తుంది. ఈ సారి చంద్రయాన్ సజావుగా చంద్రుడి శోధనకు దిగ్విజయంగా నింగికేగాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రయోగం విజయవంతం అయితే భారత్ అంతరిక్ష ప్రయోగాల్లోనే తన ర్యాంక్ ను మొదటి స్థానంలో నిలుపుకోనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories