Bandar Abbas Port Explosion: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు... భారీ సంఖ్యలో మృతులు, వందల మందికి గాయలు


Bandar Abbas Port Explosion: ఇరాన్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజధాని టెహ్రాన్‌కు 1000 కిమీ దక్షిణాన ఉన్న బందర్ అబ్బాస్ పోర్టుకు సమీపంలోని ఆయిల్...
Bandar Abbas Port Explosion: ఇరాన్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజధాని టెహ్రాన్‌కు 1000 కిమీ దక్షిణాన ఉన్న బందర్ అబ్బాస్ పోర్టుకు సమీపంలోని ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల ధాటికి కొంతమంది కార్మికులు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. సుమారు 400 మందికిపైనే కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది.
పేలుడు దృశ్యాలు దూరంగా ఉన్న ఒక కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తేనే ప్రమాదం తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతోంది. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ నిత్యం ఎగుమతులు, దిగుమతుల ఓడల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో భారీ ఎత్తున పేలుళ్లు జరగడం అంటే ఆ నష్టం భారీగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేలపై పేలుళ్లతో మొదలైన పొగ నింగిని తాకిందా అన్నట్లుగా పోర్టు సిటీ మొత్తం వ్యాపించింది.
⚡BREAKING:
— War Analysis (@iiamguri9) April 26, 2025
A huge explosion rocks Aftab oil refinery at the port of Bandar Abbas, a key Iranian city on the Strait of Hormuz.
The explosion caused widespread damage to homes and vehicles within a one-kilometre radius of the blast site.
The cause is unclear. pic.twitter.com/zhovwheGKg
ఇరాన్ మీడియా వార్తా కథనాలల ప్రకారం తొలుత కంటైనర్ యార్డులో ఈ పేలుళ్లు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ తరువాత ఈ ప్రమాదం ఆయిల్ రిఫైనరీలో జరిగినట్లు తెలిసింది. గుజరాత్‌లోని కాండ్ల పోర్ట్ నుండి ఇరాన్‌లోని ఈ అబ్బాస్ పోర్టుకు 1475 కిమీ దూరం ఉంటుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



