శుభవార్త..కరోనా పై యుద్ధానికి రెండు టీకాలు సిద్ధం చేస్తున్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు!

శుభవార్త..కరోనా పై యుద్ధానికి రెండు టీకాలు సిద్ధం చేస్తున్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు!
x
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా విరుచుకు పడుతోంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించడం.. వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడకపోవడం వంటి ఇబ్బందులతో...

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా విరుచుకు పడుతోంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించడం.. వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడకపోవడం వంటి ఇబ్బందులతో కరోనా ప్రభావాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాలకు కష్టంగా మారింది. కరోనా ను ఎదుర్కునే క్రమంలో ఇప్పటివరకూ కేవలం లక్షణాలను తగ్గించడం పైనే దృష్టి సారిస్తూ కరోనా ఉద్రుతిని తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనికోసం దాదాపుగా ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ నివారణకు టీకాలు కనుగునేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు మెరుగైన ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ నివారణకు రెండు టీకాలను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు. వీటిపై పరీక్షలు మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా లోని కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (CSIRO) పరిశోధకులు ఈ విషయంలో పెద్ద ముందడుగు వేశారు. వైరస్ నుంచి రక్షణ కోసం ఈ టీకాలను ఎలా ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నట్టు ఈ పరిశోధనల్లో పాలు పంచుకుంటున్న ట్రెవర్ డ్రూ చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ టీకాలు ఎలా వాడాలనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆ వార్తలు వివరిస్తున్నాయి. ఇంజెక్షన్ రూపంలో ఈ టీకాను ఇవ్వాలా లేక ముక్కులో వేసుకునే స్ప్రే రూపంలో తీసుకురావాలా ఏ పధ్ధతి మెరుగ్గా ఉంటుంది అనే అంశంపై ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ టీకాలపై ప్రయోగాలకు.. ఫలితాలను తెలుసుకోవడానికి మూడునెలల సమయం పడుతుందని ట్రెవర్ డ్రూ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories