Queensland Floods: క్వీన్స్‌లాండ్‌లో భారీ వరదలు.. నీటమునిగిన విమానాశ్రయం..!

Australia Queensland Flood Airport Aeroplane Submerged Due To Heavy Rains
x

Queensland Floods: క్వీన్స్‌లాండ్‌లో భారీ వరదలు.. నీటమునిగిన విమానాశ్రయం..!

Highlights

Queensland Floods: భారీ వర్షాలతో కొట్టుకువచ్చిన మొసళ్లు

Queensland Floods: ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో జాస్పర్‌ తుపాను కారణంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. 1977లో నమోదైన భారీ వరదల రికార్డును ఇవి దాటేసి ఉంటాయని క్వీన్స్‌లాండ్‌ ప్రీమియర్‌ జాన్‌ మైల్స్‌ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో బ్లాక్‌ మౌంటైన్‌లో 625 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలిపింది. తుపాను మొదలైన నాటి నుంచి 20 చోట్ల మీటరుకు పైగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. డెయిన్‌ట్రీ నదీ పరీవాహక ప్రాంతంలో మొత్తం 820 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశం ఈ స్థాయి వర్షపాతం చవిచూడటం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా నదులు, కాల్వలు కట్టలు తెంచుకొన్నాయి. కెయిర్న్స్‌ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలో ఏకంగా 2 మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ భారీ వరదలు విరుచుకుపడ్డాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వైద్యశాలలు కూడా నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలోకి మొసళ్లు కొట్టుకొచ్చాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో దాదాపు 300 మందిని రక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories