ఆఫ్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం

ఆఫ్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం
x
Highlights

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఈ వేదిక ప్రాంగణం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. తుపాకుల కాల్పులు కూడా...

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఈ వేదిక ప్రాంగణం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. తుపాకుల కాల్పులు కూడా వినిపించాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చినవారు భయంతో పరుగులు తీశారు. ఇది ఉగ్రవాద చర్య అవునా? కాదా? అనేది నిర్థారణ కాలేదు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం తదితర వివరాలపై అధికారిక సమాచారం లేదు.

పేలుళ్ళు సంభవించిన తర్వాత అష్రఫ్ ఘనీ మాట్లాడుతూ, ''నేను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించలేదు, కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నాను. నా తలను త్యాగం చేయవలసి ఉన్నా నేను ఇక్కడే ఉంటాను'' అని పేర్కొన్నారు.

ప్రత్యర్థులైన ఆఫ్ఘనిస్థాన్ నేతలు అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా వేర్వేరుగా ఆ దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు కార్యక్రమాలను వందలాది మంది వీక్షించారు. ఇద్దరు నేతలు దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో తాలిబన్లతో చర్చలు గందరగోళంలో పడ్డాయి. శాంతి ఒప్పందాన్ని ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై అమెరికాకు కూడా ఇది సందిగ్ధ పరిస్థితే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories