వైట్ హౌజ్ బయట అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్పులు

Armed suspected suicidal man shot by US secret service agents after confrontation outside White House when prez Donald Trump in Florida
x

వైట్ హౌజ్ బయట అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్పులు

Highlights

Armed man shot by US secret service agents near White House: వైట్ హౌజ్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక కాల్పులు చోటుచేసుకున్నాయి. వైట్ హౌజ్ బయట...

Armed man shot by US secret service agents near White House: వైట్ హౌజ్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక కాల్పులు చోటుచేసుకున్నాయి. వైట్ హౌజ్ బయట పశ్చిమ దిశలో కూతవేటు దూరంలోనే ఈ ఘటను జరిగింది. ఇండియానా నుండి ఒక అనుమానాస్పద వ్యక్తి ఆత్మాహుతిదాడి చేసే లక్ష్యంతో వాషింగ్టన్ వస్తున్నట్లుగా ముందుగానే వాషింగ్టన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆ వ్యక్తి కోసం మాటువేసి ఉన్నాయి.

శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత వైట్ హౌజ్ సమీపంలో ఓ వాహనం పార్క్ చేసి కనిపించింది. ఆ వాహనం సమీపంలోనే ఒక వ్యక్తి నడుస్తుండటాన్ని గుర్తించారు. ఆ వ్యక్తిని అదే సూసైడల్ ఎటాక్ కోసం వచ్చిన అనుమానితుడిగా భావించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆయన వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతలోనే వారిని చూసి ఆ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు. దాంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కూడా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో అనుమానితుడికి గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కొలంబియా జిల్లా మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వస్తున్నందున వారే ఈ కేసును దర్యాప్తు చేస్తారని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తెలిపారు.

ఈ కాల్పుల ఘటన జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ బిల్డింగ్‌లో లేరు. ఆయన ఫ్లోరిడాలో ఉన్నారు.

Also watch this video:Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియాకు వేల కోట్ల నష్టం

Show Full Article
Print Article
Next Story
More Stories