చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్ సంచలన వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

చైనా అధ్యక్షుడు షి జిన్‎పింగ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇటీవలె భారత్ పర్యటన ముగించుకొని నేపాల్ పర్యటనకు వెళ్లారు చైనా అధ్యక్షుడు. ప్రధానిగా తొలిసారి నేపాల్ పర్యటించిన షిజిన్ పింగ్ ఆదివారం అక్కడి నేతలతో చర్చలు జరిపారు.

చైనా అధ్యక్షుడు షి జిన్‎పింగ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇటీవలె భారత్ పర్యటన ముగించుకొని నేపాల్ పర్యటనకు వెళ్లారు చైనా అధ్యక్షుడు. ప్రధానిగా షిజిన్ పింగ్ తొలిసారి నేపాల్ పర్యటించి అక్కడి నేతలతో చర్చలు జరిపారు. అయితే చర్చల్లో టిబెటన్ల మతగురువు దలైలామాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చైనాను విభజించాలని ఎవరు ప్రయత్నించిన కఠినంగా శిక్షిస్తామని హెచ్చిరించారు. ఈ సందర్భంగా నేపాల్ కు రానున్న రెండేళ్ల ఆర్ధికపరంగా సహాకారాన్నిఅందిస్తామని ప్రకటించారు. అలాగే ట్రాన్స్ హిమాలయన్ రైలు మార్గం నిర్మాణ ప్రతిపాదన కూడా పరిశీలింస్తామని చైనా అధ్యక్షడు షిజిన్ పింగ్ తెలిపారు.

ఈ సందర్భంగా నేపాల్, చైనా పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా నేపాల్ తమ భూ భాగంలో చైనా వ్యతిరేక కార్యకలపాలను ఎలాంటి పరిస్థితిలోనూ అనుమతించబోమని తెలిపింది. నేపాల్ లో టిబెటన్లు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారు. టిబెటన్లు మతగురువు దలైలామాను కలిసేందుకు ప్రతి ఏటా 2వేల మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జిన్ పింగ్ టిబెటన్లలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories