Afghanistan: మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్‌

Another Bomb Blast in Nangarhar Masjid Afghanistan
x

నంగర్హర్ లోని మజీద్ లో బాంబు బ్లాస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Afghanistan: నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని మసీదులో భారీ పేలుడు

Afghanistan: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని ఓ మసీదులో జరిగిన ఉగ్రవాద దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఖొరసాన్ 2015 నుంచి నన్‌గర్హర్ ప్రావిన్స్‌లో కార్యకలాపాలు జరుపుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన అనేక దాడులకు బాధ్యతను ప్రకటించుకుంది. అయితే, తాజా దాడికి బాధ్యతను ఏ సంస్థా ఇంకా ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories