Pahalgam terrorist attack:పాకిస్తాన్ కు మరో పెద్ద దెబ్బ! పాక్ ఆర్మీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ బ్యాన్

Pahalgam terrorist attack:పాకిస్తాన్ కు మరో పెద్ద దెబ్బ! పాక్ ఆర్మీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ బ్యాన్
x
Highlights

Pahalgam terrorist attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్- పాకిస్తాన్‌పై నిరంతరం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న సాయంత్రం, భారత్ ...

Pahalgam terrorist attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్- పాకిస్తాన్‌పై నిరంతరం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న సాయంత్రం, భారత్ పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఈ ఉదయం పాకిస్తాన్ ISPR అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా భారతదేశంలో బ్లాక్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంది పాకిస్తాన్ ప్రముఖుల యూట్యూబ్ ఛానెల్‌లను, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా X హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు డాన్ తో సహా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్ భారతదేశంలో బ్లాక్ చేసింది. భారత్, పాకిస్తాన్‌లపై నివేదికలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని భారత్ బిబిసిని హెచ్చరించింది. భారత సైన్యం, భారత ప్రభుత్వం, భారత భద్రతా సంస్థలపై తప్పుడు, తప్పుదారి పట్టించే, సామాజిక వ్యతిరేక, రెచ్చగొట్టే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు పాకిస్తాన్ యూట్యూబ్, X హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయాలని భారతదేశం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories