ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం
x
Donald Trump (File Photo)
Highlights

అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకోనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకోనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ దేశంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కరోనాతో 42,560 మంది మరణించారు. అలాగే 8 లక్షలకు పాజిటివ్‌ కేసులు చేరువైంది. దీంతో ఈ ప్రాణాంతక వైరస్ కట్టడి చేసేందుకు గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్న షట్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. ఆ దేశంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు ఉద్యోగాలు రక్షణ కల్పించేందుకే నిర్ణయం తీసకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన ఇమ్మిగ్రేషన్‌ సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు వెల్లడించారు. ''ఓ కనిపించని అదృశ్య శక్తి(కోవిడ్ 19) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలకు భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయనున్నాను''అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇదే జరిగితే తదుపరి ఉత్తర్వుల వచ్చేవరకు వరకు ఇతరదేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు.

అమెరికాకు ఉపాధి, ఉన్నత విద్యకోసం భారతీయులు, చైనా వారే అత్యధికంగా వెళ్తారు. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ రెండు దేశాలకు చెందిన వారే అధికం. ట్రంప్‌ తాజా నిర్ణయంతో మనదేశపౌరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువ గా ఉంటుంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి సంక్షోభ పరిస్థితులని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నామని స్పష్టం చేస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories