US GBU 57: ఇరాన్ అణు బంకర్లను ధ్వంసం చేసే బాంబ్ ఇదేనా

US GBU 57
x

US GBU 57: ఇరాన్ అణు బంకర్లను ధ్వంసం చేసే బాంబ్ ఇదేనా..

Highlights

US GBU 57: అమెరికా తయారు చేసిన ఒక భారీ బాంబ్ పేరు జీబీయూ-57 MOP. ఫుల్ ఫాం చెప్పాలంటే.. మాసివ్ ఆర్డనెన్స్ పేనేట్రాటోర్. పేరు వింటే కాస్త కంగారుగా అనిపిస్తుందా, దీని శక్తి చూస్తే ఇంకా భయం కలుగుతుంది.

US GBU 57: అమెరికా తయారు చేసిన ఒక భారీ బాంబ్ పేరు జీబీయూ-57 MOP. ఫుల్ ఫాం చెప్పాలంటే.. మాసివ్ ఆర్డనెన్స్ పేనేట్రాటోర్. పేరు వింటే కాస్త కంగారుగా అనిపిస్తుందా, దీని శక్తి చూస్తే ఇంకా భయం కలుగుతుంది. ఈ బాంబ్ బరువు సుమారు 14 టన్నులు.. అంతే కాదు, భూమికి 60 మీటర్ల లోతు వరకు దూసుకుపోతూ అక్కడ పేలే సామర్థ్యం దీనిది. ఇది రన్‌వేలు కాదు, రహదారులు కాదు… స్టీల్‌ గోడలతో కట్టిన బంకర్లను కూడా చీల్చేలా రూపొందించబడింది. ఇప్పటివరకు ఈ బాంబ్ గురించి చాలా తక్కువ వివరాలు బయటికి వచ్చాయి. కానీ ఇరాన్ అణుపథకంపై ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు పెరగడం..ఇరాన్ యూరేనియం శుద్ధి పనులను పెంచుతుందన్న ఇంటెలిజెన్స్ నివేదికలు...ఇవన్నీ అమెరికాలో అలజడి రేపుతున్నాయి. వారు ఇప్పుడు ఇదే బాంబ్‌ను ప్రాసెస్లో ఉంచారని అంటున్నారు. అంటే మీ బంకర్లు ఎంత లోతుగా ఉన్నా...మేం దాటిపోతాం అని అమెరికా ఓ మెసేజ్ ఇస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది..

GBU-57 MOP ప్రత్యేకతేంటంటే?

ఇది గాలిలో పేలదు. బంకర్ ఎక్కడ ఉందో లాక్కెళ్లి, దాని ముక్కలు చేసేంత లోతులోనే పేలుతుంది. ఇది GPS గైడెన్స్‌తో పనిచేస్తుంది… అంటే ఎంత కచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ఒక బిల్డింగ్‌ మొత్తం కూల్చాల్సిన పని లేదు. కిందకి వెళ్లి బేస్‌మెంట్‌లోనే పేల్చేస్తే చాలు.. ఈ బాంబ్ టార్గెట్ ఎక్కడో అక్కడే పేలుతుంది, పైకి ఏమీ నాశనం చేయదు. ఇదే... ఫోకస్‌డ్ దాడి అన్నమాట.

ఇప్పటివరకు అయితే దీనిని యుద్ధంలో ఎప్పుడూ ఉపయోగించలేదు. ఇది ఓ ఫైనల్ వార్నింగ్‌లా చూస్తున్నారు. ఎందుకంటే..ఒక్కసారి దీన్ని ప్రయోగిస్తే… అది ఓ సర్వనాశానికి దారి తీసే నిర్ణయం అవుతుంది. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశం మీద ఇది వాడితే… అది సాధారణ దాడి కాదు,బదులుగా వస్తే పెద్ద యుద్ధమే. ప్రపంచం ఇప్పుడు మళ్లీ అణు ఆయుధాల చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు శీతయుద్ధం అంటే .. రెండు శక్తివంతమైన దేశాలు నేరుగా యుద్ధం చేయకుండా, ఒకరినొకరు భయపెట్టే ప్రయత్నాలు చేయడం. అలాంటి సమయంలో వాడిన భయపెట్టే తంత్రాలు… ఇప్పుడు మళ్లీ వస్తున్నాయంటే, ఎప్పుడైనా పెద్ద దాడి జరిగే అవకాశం ఉందన్నట్టు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories