స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా: ట్రంప్

స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా: ట్రంప్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై చాలా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆయనకు స్వాగతం స్పాలకడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై చాలా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆయనకు స్వాగతం స్పాలకడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ భారత పర్యటనకు వస్తున్నారు. ట్రంప్ కుటుంబాన్ని సాధారణంగా స్వాగతించడానికి అహ్మదాబాద్ భారీగా ముస్తాబవుతోది. తన పర్యటన పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ట్రంప్ అమెరికా మీడియాతో పలు సందర్భాల్లో చెప్పారు. ఇదిలావుంటే బాలీవుడ్ చిత్రాలపై అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్‌పై నిరంతరం స్పందిస్తున్నారని కూడా ఈ మధ్యనే ఆయన ట్వీట్ ద్వారా తెలిసింది.

ట్రంప్ తన పర్యటనకు సంబంధించి 'బాహుబలి' సినిమాకు చెందిన ఒక మార్ఫ్ వీడియోను తన ట్వీట్టర్‌లో రీట్వీట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ మారింది. భారత్‌లోని తన స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఆ మార్ఫ్ వీడియోలో ట్రంప్‌తో పాటు.. మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, జూనియర్ ట్రంప్ కూడా ఉన్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ వీడియోలో వీరితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన భార్య జశోధా బెన్ కూడా ఉన్నారు. 'సోల్' పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ ఖాదారుడు ఈ వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ట్రంప్ రీట్వీట్ చేశారు.

ఇదిలావుంటే డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 న అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుండి మోటెరా స్టేడియం వరకు రోడ్ షో చేయనున్నారు. మోటెరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. మోటెరా స్టేడియం ప్రారంభోత్సవం తరువాత, 'నమస్తే ట్రంప్' కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాత, ట్రంప్ తన కుటుంబంతో కలిసి అదే రోజు ఆగ్రాకు బయలుదేరుతారు. ఆగ్రాలో, తాజ్ మహల్ ను వీక్షిస్తారు. మరుసటి రోజు ప్రధాని మోదీతో ఇతర అతిథులను కలుస్తారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories